కొడుకుతో మెగా హీరో ముచ్చట్లు!
సినీ సెలబ్రిటీలు సినిమా షూటింగ్ ల నుండి ఇతర పనుల నుండి కాస్త విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు.
సినీ సెలబ్రిటీలు సినిమా షూటింగ్ ల నుండి ఇతర పనుల నుండి కాస్త విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. మరికొంతమంది ఇంట్లోనే తమ పిల్లలతో సమయాన్ని గడుపుతూ కాస్త మనశ్శాంతిని పొందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలు,హీరోయిన్లు తమ ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వారిని కూడా ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన కొడుకుతో ముచ్చట్లు పెట్టుకున్న సందర్భాన్ని ఫోటోల రూపంలో క్యాప్చర్ చేసి క్యాప్షన్ రూపంలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మెగా ప్రిన్స్ తో మెగా హీరో ముచ్చట్లు..
జూన్ నెల ప్రారంభం కావడంతో ఈ జూన్ నెల మరింత సంతోషంగా ఆనందంగా గడపాలి అంటూ తన కొడుకు వాయువ్ తేజ్ కొణిదెలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ పంచుకున్న ఫోటోలలో తన ఇంటి బాల్కనీలో తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకొని సంతోషంగా కొడుకు వైపు చూస్తూ గడుపుతున్న ఆ ఆనందపు క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఇందులో కోరమీసం, చింపిరి జుట్టుతో కొడుకును తదేకంగా చూస్తున్న ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికైతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రిన్స్ వాయువ్ తేజ్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారిపోయింది.
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా విశేషాలు..
వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఒక విలక్షణమైన క్రాస్ కల్చరల్ ట్విస్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా కథ ఇండియా, దక్షిణ కొరియా రెండింటిలోనూ చిత్రీకరిస్తున్నారు . ఇందులో వరుణ్ తేజ్ ఇప్పటివరకు తన కెరియర్లో పోషించని ఒక విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ ,ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా సత్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే కంసహమ్మిడ అనే పాట లిరికల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట శ్రోతలను విపరీతంగా అలరించింది. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోదరి నిర్మాణంలో భరీ..
ఈ చిత్రంతో పాటు తన సోదరి మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై నిర్మిస్తున్న భరీ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. మరొకవైపు ఈయన భార్య లావణ్య త్రిపాఠి కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఏది ఏమైనా భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు వరుస సినిమాలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు కాస్త సమయం దొరికితే కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.