వారణాసి: కుంభకర్ణుడి గురించి ప్రపంచ దేశాలు గూగుల్‌లో వెతికే రేంజ్ పోరాటం!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి` చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కథాంశం గురించి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే చాలా విషయాలను వెల్లడించారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి` చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కథాంశం గురించి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే చాలా విషయాలను వెల్లడించారు. ఇదొక వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కుతోందని, రామాయణ కాలానికి- ప్రస్తుత కలియుగానికి ఉన్న లంకెను ఇందులో ఆవిష్కరించబోతున్న విషయ ఆయన మాటలను బట్టి అర్థమైంది. అంతేకాదు ద్వాపర యుగంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని చూపించడం ద్వారా శ్రీకృష్ణుడి కాలాన్ని, అలాగే శ్రీరాముడి కాలాన్ని కలిపి.. శ్రీమహావిష్ణువు అవతారాల వైభవాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా జోడించబోతున్నారు. ఈ మూడు కాలాల నేపథ్యంలో శ్రీరాముడి పాత్రను అత్యంత శక్తివంతంగా చూపించేందుకు రాజమౌళి సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు.
సాధారణంగా ఇప్పటివరకు వచ్చిన రామాయణ గాథల్లో రాముడు - రావణాసురుడి మధ్య జరిగే క్లైమాక్స్ యుద్ధాన్ని మాత్రమే పీక్స్‌లో చూపిస్తూ వచ్చారు. కానీ భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా `వారణాసి` చిత్రంలో రాముడు - కుంభకర్ణుడి మధ్య జరిగే భీకర పోరాటాన్ని మేజర్ హైలైట్‌గా చూపించబోతున్నారు. రావణ లంకపై రాముడు దండెత్తే క్రమంలో ఎదురయ్యే మరణం అన్నదే లేని, అజేయుడైన కుంభకర్ణుడితో శ్రీరాముడు తలపడే ఈ ఎపిసోడ్ ఏకంగా 30 నిమిషాల పాటు సాగనుందని సమాచారం. రాజమౌళి అసాధారణ విజన్‌తో తెరకెక్కబోయే ఈ యుద్ధ ఘట్టం, `ఆర్ఆర్ఆర్` లోని భీకర పోరాటాల రేంజులో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అత్యుత్తమ ఘట్టం కానుందని తెలుస్తోంది.
రామాయణ కథ ప్రకారం,.. లంకాధిపతియైన రావణాసురుడు అధర్మ మార్గంలో సీతాదేవిని అపహరించినప్పుడు మహాసాధ్విని రక్షించడానికి శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకపై దండయాత్ర చేస్తాడు. ఈ యుద్ధంలో రావణుడి సేనలు ఒక్కొక్కటిగా కూలిపోతున్న సమయంలో ఆరు నెలల పాటు నిద్రపోయే పర్వతాకారుడైన తన సోదరుడు కుంభకర్ణుడిని రావణుడు బలవంతంగా నిద్ర లేపుతాడు. అన్న మాట కోసం రణరంగంలోకి అడుగుపెట్టిన కుంభకర్ణుడు వానర సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తూ బీభత్సం సృష్టిస్తాడు. అలాంటి అసాధారణ బలశాలి, పర్వతసమాన దేహమున్న రాక్షసుడిని అంతమొందించడానికి శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుంది. వీరిద్దరి మధ్య జరిగే ఆ మహా సంగ్రామాన్నే రాజమౌళి తన శైలిలో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక కుంభకర్ణుడి పాత్ర గురించి జనాలు గూగుల్‌లో వెతికే రేంజ్ లో మాస్టర్ స్టోరీ టెల్లర్ ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారు.
అయితే ఈ 30 నిమిషాల కుంభకర్ణ - రామ యుద్ధ సన్నివేశాన్ని కనులవిందుగా చూపించడం కోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేస్తోందని ఫిలిం నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క ఫైట్ ఎపిసోడ్ విజువలైజేషన్ మరియు హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ (VFX) గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు దాదాపు 85 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ హాలీవుడ్ స్థాయి విజువల్స్- శ్రీరాముడిగా మహేష్ పరాక్రమం తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. కేవలం ఆ ఒక్క సీన్ గ్రాఫిక్స్ హంగుల కోసమే ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారంటే.. రాజమౌళి ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ఏ రేంజ్ గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.