మెగా అల్లుడికి టచ్ లోకి వెళ్లిన ప్రవీణ్ సత్తారు!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ అయి రెండు సంవ్సతరాలు సమీపిస్తుంది.;
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ అయి రెండు సంవ్సతరాలు సమీపిస్తుంది. `ఆదికేశవ` ప్లాప్ తర్వాత వైష్ణవ్ మళ్లీ తెరపై కనిపించలేదు. `కొండపొలం`, `రంగ రంగ వైభవం`, `ఆదికేశవ` కూడా ప్లాప్ అవ్వడంతో మార్కె ట్ పై ప్రభావం పడింది. దీంతో కొత్త సినిమా విషయంలో డైలమాలో పడ్డాడు. ఆ డైలమా ఏ రేంజ్ లో సాగించాడంటే ఏకంగా రెండేళ్లు కాలం వెళ్లదీసాడు. వింటోన్న కథలు ఏవీ నచ్చకపోవడం..నచ్చిన కథల్లో తాను సెట్ అవ్వకపోవడంతో రెండేళ్లు వృద్ధాగా పోయింది. కొడితే హిట్ కంటెంట్ తోనే రావాలని వైష్ణవ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు.
రెండేళ్లగా ఇద్దరు ఖాళీ:
ఈ నేపథ్యంలో పరశురాం, `క` మేకర్స్ సుజిత్-సుదీప్ ద్వయం కూడా కథ వినిపించినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ఈ వరుసలో ప్రవీణ్ సత్తారు చేరాడు. ఇటీవలే ప్రవణ్ కూడా వైష్ణవ్ కి రెండు గంటల పాటు ఓ స్టోరీ వినిపించాడుట. మరి వైష్ణవ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందన్నది తెలియదు గానీ ప్రవీణ్ మాత్రం నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెండేళ్లగా ఖాళీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. చివరిగా మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా `గాండీవధారి అర్జున` అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించాడు.
మెగా మేనల్లుడికి ప్రామిస్:
భారీ అంచనాల మధ్య రూపొందింది. కానీ రిలీజ్ తర్వాత ఫలితం తారుమారైంది. అటుపై ప్రవీణ్ నుంచి మరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా కాంపౌండ్ హీరోని అప్రోచ్ అవ్వడం ఆసక్తికరం. మేకర్ గా ప్రవీణ్ కి మంచి గుర్తింపు ఉంది. డీసెంట్ స్టోరీలతో పాటు, బోల్డ్ అటెంప్ట్స్ చేసాడు. `పీఎస్ వీ గరుడ` లాంటి యాక్షన్ సినిమా చేసాడు. ఆ సినిమా మేకింగ్ తోనే వరుణ్ తో ఛాన్స్ అందుకోగలిగాడు. మరి వైష్ణవ్ కి ఎలాంటి స్టోరీ నేరేట్ చేసాడు? అన్నది తెలియాలి. అయితే వైష్ణవ్ కి ఇక్కడ మరో ప్రామిస్ కూడా చేసాడని వినిపిస్తోంది.
కొత్త ఏడాదిలో కొత్త కబురు?
డైరెక్టర్ గానే కాకుండా సినిమా నిర్మాణంలో కొంత పెట్టుబడి తానే స్వయంగా పెడతానని చెప్పాడుట. మరి ఇదంతా నిజమా? కాదా? అన్నది తేలాలి. నిజమే అయితే కథపై తానెంత కాన్పిడెంట్ గా ఉన్నాడు? అన్నది అద్దం పట్టడానికి ఓ సంకేతంగా చెప్పొచ్చు. మరి కొత్త ఏడాదిలో అధికారికంగా కొత్త విషయం ఏదైనా చెబుతాడా? అన్నది చూడాలి. అలాగే మెగా మేనల్లుడు నుంచి అభిమానులు అలాంటి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ? అన్నది అంతే వాస్తవం.