'గబ్బర్‌సింగ్‌' గాయకుడు మృతి

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వడ్డేపల్లి శ్రీనివాస్ నేడు ఆయన నివాసం అయిన సికింద్రాబాద్ చిలకలగూడలోని ఇంట్లో తుది శ్వాస విడిచారు.

Update: 2024-02-29 12:39 GMT

టాలీవుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు దృవీకరించారు. ఆయన తన 73వ ఏట అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్ పిల్లా నువ్వు లేని జీవితం పాటను పాడిన వడ్డేపల్లి శ్రీనివాస్ పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్ ను పాడి ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నాడు. పలువురు సంగీత దర్శకులతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వడ్డేపల్లి శ్రీనివాస్ నేడు ఆయన నివాసం అయిన సికింద్రాబాద్ చిలకలగూడలోని ఇంట్లో తుది శ్వాస విడిచారు. జానపద గాయకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న వడ్డేపల్లి శ్రీనివాస్‌ గబ్బర్‌ సింగ్ సినిమాతో పాటు ఇంకా కింగ్‌, బెంగాల్ టైగర్‌, నమస్తే అన్న తదితర సినిమాల్లో పాటలు పాడాడు.

వందకు పైగా పాటలు పాడుతూ అలరించిన వడ్డేపల్లి శ్రీనివాస్‌ కి ఫిల్మ్‌ ఫేర్‌ లో బెస్ట్‌ ప్లే బ్యాక్ సింగ్ అవార్డు దక్కించుకున్నాడు. కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా స్టేజ్ పై తన డాన్స్ తో కూడా పలు వేదికలపై అలరించాడు.

Tags:    

Similar News