అప్పుడు A, ఉపేంద్ర.. ఇప్పుడు K.G.F, కాంతారా..?

నిజంగానే నమ్మ ఉపేంద్ర ఒక ప్రత్యేకమైన యాక్టర్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలు ఆ రోల్స్ చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప.;

Update: 2025-11-21 12:30 GMT

కన్నడలో వర్సటైల్ యాక్టర్ అంటే అందరు కచ్చితంగా చెప్పే పేరు ఒక్కటే ఆయనే ఉపేంద్ర. కన్నడ హీరోనే అయినా తెలుగులో కూడా ఆయనకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన A, ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా సూపర్ పాపులారిటీ సంపాదించారు. ఐతే ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలను గుర్తు పెట్టుకుని మరీ ఉపేంద్ర ఇప్పుడు చేస్తున్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసే తెలుగు ఆడియన్స్ ఉన్నారు. ఆయనకు అప్పట్లో ఉన్న క్రేజ్ చూసి కన్యాదానం లాంటి సినిమాల్లో తీసుకున్నారు మన మేకర్స్.

ఉపేంద్ర నుంచి కాంతారా లాంటి సినిమా..

ఇదిలా ఉంటే సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఉపేంద్ర నటించిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాలో ఆయన ఒక సూపర్ స్టార్ పాత్రలోనే నటిస్తున్నారు. ఐతే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఉపేంద్ర కన్నడ పరిశ్రమలో ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి మాట్లాడారు. ఉపేంద్ర నుంచి కాంతారా లాంటి సినిమా వస్తుందా అంటే.. ఉపేంద్ర కాంతారా ఎందుకు తీస్తాడు.. నా స్టైల్ నాదంటూ సమాధానం ఇచ్చారు ఆయన.

కె.జి.ఎఫ్, కాంతారా సినిమాలే కాదు అప్పట్లో కూడా కన్నడ నుంచి భారీ సినిమాలు వచ్చాయని అన్నారు ఉపేంద్ర. తన స్టైల్ లో తాను సినిమాలు తీస్తా తప్ప వేరే వాటిని చేయనని అన్నారు ఆయన. ఈ క్రమంలో మామిడి పండు మామిడి పండులానే ఉంటుంది కానీ మరో పండులా ఉండదు. అందుకే నేను ఒకరిని ఫాలో అవ్వను.. నాదొక వెరైటీ అని ఆన్సర్ ఇచ్చారు ఉపేంద్ర.

ఉపేంద్ర ఒక ప్రత్యేకమైన యాక్టర్..

నిజంగానే నమ్మ ఉపేంద్ర ఒక ప్రత్యేకమైన యాక్టర్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలు ఆ రోల్స్ చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప. అలాంటి కథలను రాసుకుని డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం అంటే నిజంగానే గొప్ప విషయమని చెప్పొచ్చు. ఐతే ఉపేంద్ర ఒక 2, 3 ఏళ్ల క్రితం కబ్జా అనే సినిమా చేశారు. ఆ సినిమా కె.జి.ఎఫ్ స్పూర్తితోనే తీశారన్న కామెంట్స్ అప్పట్లో వచ్చాయి.

ఏది ఏమైనా ఉపేంద్ర తెలుగులో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేయడం ఆ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. తప్పకుండా ఆ సినిమాలో ఉపేంద్ర ఉండటం సినిమాకు ఒక బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. రాం, భాగ్య శ్రీ బోర్స్ జంటగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ అంతా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. ఉపేంద్ర ఇంపార్టెంట్ రోల్ అది కూడా సినిమాలో ఆయన ఒక హీరోగానే చేస్తున్నాడన్న రీజన్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాను కన్నడలో కూడా భారీ రిలీజ్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

Tags:    

Similar News