క‌మ‌ల్ మ‌న‌సుకు న‌టి గాయం..శ్రీదేవి మాత్రం చెల్లే!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలిసిందే. 1978 లో వాణిగ‌ప‌తిని వివాహం చేసుకున్నారు.;

Update: 2025-05-18 06:06 GMT

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలిసిందే. 1978 లో వాణిగ‌ప‌తిని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు క‌లిసి ఉన్న ఆ జంట 1988 లో విడిపోయారు. అదే ఏడాది సారికా టూకూర్ న‌వి రెండ‌వ వివాహం చేసుకున్నారు. ఆ బంధం కొంత కాలానికే ప‌రిమిత‌మైంది. 2004లో విడాకులు తీసుకున్నారు. అటుపై న‌టి గౌత‌మితో చాలా కాలం పాటు రిలేష‌న్ షిప్ కొన‌సాగించారు.

అయితే ఈసారి వివాహానికి ఛాన్స్ ఇవ్వ‌కుండా కేవ‌లం రిలేష‌న్ షిప్ వ‌ర‌కే ప‌రిమితం చేసారు. ఈ రిలేష‌న్ షిప్ కి 2016లో పుల్ స్టాప్ పెట్టేసారు. అప్ప‌టి నుంచి క‌మ‌ల్ సింగిల్. అయితే ఈ ముడు బంధాల‌కంటే అమితంగా క‌మ‌ల్ ప్రేమించిన మ‌రో న‌టి కూడా ఉన్నారు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. క‌మ‌ల్ హాస‌న్ తొలిసారి ప్రేమించింది న‌టి శ్రీవిద్య‌ని అట‌.

శ్రీవిద్య గొప్ప అంద‌గ‌త్తె అప్ప‌ట్లో. చాలా కాలం పాటు సినిమాల్లొ కొన‌సాగారు. ఇద్ద‌రు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారుట‌. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారుట‌. కానీ చివ‌రి నిమిష‌లో ఆ పెళ్లి ఆగిపోయిం ద‌న్నారు. అలా పెళ్లి విఫ‌లం అవ్వ‌డం అన్న‌ది క‌మ‌ల్ మ‌న‌సులో ఓ గాయంగా మారిపోయింది. ఇప్ప‌టికీ గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా ఆ గాయం స‌లుపుతూనే ఉంద‌న్నారు. కెరీర్ ప్రారంభంలోనే శ్రీవిద్య‌ను క‌మ‌ల్ ఆరాధిం చ‌డం మొద‌లు పెట్టారుట‌.

అలాగే అతిలోక సుంద‌రి శ్రీదేవి తో కూడా క‌మ‌ల్ హాస‌న్ చాలా క్లోజ్ గా ఉండేవారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చేవి. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని పెద్ద‌లు కూడా అడిగారుట‌. కానీ క‌మ‌ల్ ఆమెని ఓ కుటుంబ స‌భ్యురాలిలా..ఓ చెల్లిలా భావించానని మాత్ర‌మే చెప్పారు.

Tags:    

Similar News