సూపర్‌ స్టార్‌కి ప్రత్యామ్నాయం లభించాడు..!

దేశంలోనే పాపులర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్‌ నికమ్‌కి మంచి పేరు ఉంది. ఎన్నో కేసుల్లో ఆయన దోషులకు శిక్ష పడేలా చేశారు.;

Update: 2025-04-21 05:59 GMT

దేశంలోనే పాపులర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్‌ నికమ్‌కి మంచి పేరు ఉంది. ఎన్నో కేసుల్లో ఆయన దోషులకు శిక్ష పడేలా చేశారు. బాంబు పేలుడు ఘటనలు మొదలుకుని ఎన్నో కేసుల్లో సామాన్యుల నుంచి మొత్తం దేశానికి న్యాయం జరిగే విధంగా, తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా వాదించి న్యాయం గెలిచేలా చేశాడు. అలాంటి ఉజ్వల్‌ నికమ్‌ జీవిత చరిత్రను సినిమా రూపంలో ప్రేక్షకులకు అందించాలని నిర్మాత దినేష్‌ విజన్‌ బలంగా కోరుకుంటున్నాడు. అందుకోసం ఇప్పటికే బయోపిక్‌కి సంబంధించిన అనుమతులు తీసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. అతి త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

ఉజ్వల్‌ నికమ్‌ బయోపిక్‌ అనుకున్న సమయంలో నిర్మాత దినేష్‌తో పాటు పలువురు ఆమీర్‌ ఖాన్‌ పేరును సూచించారు. ఆమీర్ ఖాన్‌ సైతం బయోపిక్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఆయన గురించి తెలుసుకున్న సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ ఆ పాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ సినిమా షూటింగ్‌ ప్రారంభంకు చేరువ అవుతున్న సమయంలో అనూహ్యంగా ఆమీర్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆమీర్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు అంతా అవాక్కయ్యారు. ఆమీర్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి మంచి పాత్రలను, మంచి సినిమాలను వదులుకోవడం మంచి నిర్ణయం కాదు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆమీర్ ఖాన్ నో చెప్పడంతో ఉజ్వల్‌ బయోపిక్‌ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలు పలువురి వద్దకు తీసుకు వెళ్లారట. కొందరు ఆమీర్‌ నో చెప్పడంతో కథ వినకుండానో నో చెప్తే మరికొందరు ఏవో కారణాలు చెప్పి తిరస్కరించారని సమాచారం. అమీర్ ఖాన్‌ సినిమాకు నో చెప్పడంతో ఆ స్థానంను భర్తీ చేయడానికి రాజ్ కుమార్‌ రావు ను రంగంలోకి దించారని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ కుమార్‌ రావుతో లుక్‌ టెస్ట్‌ పూర్తి అయిందట. అంతే కాకుండా ఆయనకు స్క్రిప్ట్‌ సైతం నచ్చడంతో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడట. ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో కోర్ట్‌ రూం డ్రామాలకు మంచి డిమాండ్‌ ఉంది. సౌత్‌, నార్త్‌ అన్ని చోట్ల కోర్ట్‌ రూం డ్రామాలు సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. అందుకే ఉజ్వల్‌ నికమ్‌ బయోపిక్‌లో నటించేందుకు గాను రాజ్‌ కుమార్‌ రావు ఓకే చెప్పాడని, ఆయన గత చిత్రం స్త్రీ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ బయోపిక్‌లో నటించేందుకు గాను భారీ పారితోషికం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. దేశం మొత్తాన్ని కుదిపేసిన ప్రముఖ కేసులకు సంబంధించిన విషయాలు మరోసారి ఈ సినిమా విడుదల తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రేక్షకుల నుంచి సినిమాకు హిట్‌ టాక్ దక్కడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News