ఉస్తాద్ సర్ ప్రైజ్.. అల్ట్రా స్టైలిష్ లో పవర్ స్టార్

ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌నే ఫుల్‌గా షేర్ చేస్తున్నారు. ఆయన చేయబోయే డ్యాన్స్ నంబర్స్ ఎలా ఉండబోతాయా అన్న ఉత్సుకత అప్పుడే మొదలైంది.;

Update: 2025-09-01 11:45 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ప్రతి సంవత్సరం అభిమానులకు ఒక పండుగ వాతావరణమే. ఈసారి కూడా మేకర్స్ ముందుగానే ఫ్యాన్స్ కోసం స్పెషల్ గిఫ్ట్స్ రెడీ చేశారు. పవన్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి హైప్ రెట్టింపు చేశారు.

 

ఈ కొత్త పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ పూర్తిగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకుని పవన్ ఇచ్చిన డ్యాన్స్ ఫోజ్ కింగ్ లా కనిపించింది. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న క్లాక్ సెట్ అద్భుతమైన గ్రాండ్ లుక్‌ను తీసుకొచ్చింది. పవన్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్ ఇవన్నీ కలిపి ఈ పోస్టర్‌ను నెక్ట్స్ లెవెల్‌లోకి తీసుకెళ్లాయి.

ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌నే ఫుల్‌గా షేర్ చేస్తున్నారు. ఆయన చేయబోయే డ్యాన్స్ నంబర్స్ ఎలా ఉండబోతాయా అన్న ఉత్సుకత అప్పుడే మొదలైంది. గబ్బర్ సింగ్ తరహాలోనే మరింత పవర్‌ఫుల్ మాస్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్‌తో ఈ సినిమా వస్తుందని అనుకుంటున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ స్టైల్ డైలాగ్స్‌తో పాటు పవన్ ఎనర్జీ కలిస్తే పెద్ద ఎత్తున సెలబ్రేషన్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇద్దరు బ్యూటీస్ పవన్‌తో స్క్రీన్ షేర్ చేయడం స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇక రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటం మరింత ఎక్స్‌పెక్టేషన్‌ను పెంచుతోంది.

పవర్ స్టార్ స్టైలిష్ డ్యాన్స్ మువ్స్, మాస్ డైలాగ్స్, మాస్ ఫీలింగ్ కలగలిపిన ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి, పవన్ బర్త్‌డే పోస్టర్ అభిమానులకు నిజమైన గిఫ్ట్ అయింది. ఈ విజువల్‌ను చూసి ఫ్యాన్స్ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. మరి మేకర్స్ రాబోయే రోజుల్లో ఇంకెలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News