గురూజీ డెడ్ స్లో..ఇలా అయితే ఎలా?
త్రివిక్రమ్ టాలీవుడ్ జర్నీ ఎలా మొదలైందో తెలిసిందే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి డైరెక్టర్ గా ఎదిగారు.;
త్రివిక్రమ్ టాలీవుడ్ జర్నీ ఎలా మొదలైందో తెలిసిందే. రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి డైరెక్టర్ గా ఎదిగారు. `స్వయం వరం`తో తొలిసారి స్టోరీ రైటర్ గా పరిచయమయ్యారు. అటుపై రెండు..మూడేళ్ల గ్యాప్ లోనే `నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. అయినా స్టోరీ రైటింగ్ మాత్రం ఆపలేదు. చాలా సినిమాలకు స్టోరీ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసారు. అదే సమయంలో డైరెక్టర్గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారు. అయితే 20 ఏళ్ల డైరెక్షన్ కెరీర్ లో గురూజీ చేసింది చాలా తక్కువ సినిమాలే. కేవలం 13 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసారు.
అందరూ స్టార్ హీరోలే:
తొలి సినిమా `నువ్వే నువ్వే` మంచి విజయం సాధించింది. అనంతరం మహేష్ తో `అతడు` తెరెక్కించారు. ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరొచ్చింది. అటుపై పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన `జల్సా` బ్లాక్ బస్టర్ అయింది. ఈ రెండు విజయా లు చూసి మహేష్ `ఖలేజా`కి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ సినిమా ప్లాప్ అయింది. దీంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `జులాయి` చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ తో రెండవ సారి `అత్తారింటికి దారేది` తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది.
మహేష్ ఛాన్స్ ఇవ్వడానికి 14 ఏళ్లు:
పవన్ కెరీర్ లో నే ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. అటుపై మళ్లీ బన్నీతోనే `సన్నాఫ్ సత్యామూర్తి` తీసారు. ఇది యావరేజ్ గా ఆడింది. అనంతరం నితిన్ తో `అఆ` తెరకెక్కించి యావరేజ్ హిట్ అందుకున్నారు. అటుపై రెండేళ్లు గ్యాప్ తీసుకుని `అజ్ఞాతవాసి` అనే ప్లాప్ సినిమా తీసారు. అదే ఏడాది ఎన్టీఆర్ తో `అరవింద సమేత వీరరాఘవ` అనే హిట్ ఇచ్చి ప్లాప్ ని బ్యాలెన్స్ చేసారు. మళ్లీ రెండేళ్లు సమయం తీసుకుని బన్నీతో `అలవైకుంఠపురములో` తెరకకెక్కించారు. ఇది బ్లాక్ బస్టర్ అయింది. `ఖలేజా` ప్లాప్ తర్వాత మహేష్ మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి 14 ఏళ్లు సమయం పట్టింది.
హీరోలు దొరకక..స్టోరీలు లేక:
ఈ సారి మాత్రం `గుంటూరు కారం`తో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వెంకేటష్ తో `ఆదర్శ కుటుంబ హౌస్ నెంబర్ 47` తీస్తున్నారు. మొత్తంగా 20 ఏళ్ల గురూజీ కెరీర్ చూస్తే? సినిమాలు తీయడంలో స్లో అని తెలుస్తోంది. ఆయన తోటి దర్శకులు ఏడాది రెండు సినిమాలు తీస్తుంటే? ఈయన మాత్రం ఏడాదికి ఒక సినిమా కూడా చేయలేకపోతున్నాడు. కేవలం స్టార్ హీరోలతో పని చేయాలి? అన్న ఆశతో ఎదురు చూస్తున్నారా? లేక కథలు కుదరక వెయిట్ చేస్తున్నారా? అన్నది తెలియాలి.