పవన్ ఎక్కడుంటే.. త్రివిక్రమ్ అక్కడే..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో క్లోజో అందరికీ తెలిసిందే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.;

Update: 2025-05-19 11:30 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో క్లోజో అందరికీ తెలిసిందే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. పలుమార్లు తమ స్నేహాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే వారిద్దరూ జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలకు గాను వర్క్ చేశారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాల్లో కూడా త్రివిక్రమ్ సినిమాల ప్లేవర్ కనిపించింది.

అలా త్రివిక్రమ్ పవన్ కు సలహాదారుడిగా వ్యవహరిస్తారని టాక్ ఉంది. తన సినిమాల విషయంలో త్రివిక్రమ్ ను సంప్రదించకుండా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోరని చెబుతుంటారు. అయితే పవర్ స్టార్ తన చేతిలో ఉన్న సినిమాలను ఇప్పుడు కంప్లీట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హరిహర వీరమల్లును పూర్తి చేశారు.

పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే హరిహర వీరమల్లు మూవీ విషయంలో ముందు నుంచి త్రివిక్రమ్ దూరంగా ఉన్నారు. కానీ రీసెంట్ గా పవన్ మళ్లీ సెట్స్ కు వచ్చినప్పుడు త్రివిక్రమ్ కూడా వచ్చారు. వీరమల్లు దర్శకత్వ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఫైనల్ కట్ లో కూడా త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు పవన్ ఓజీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా సెట్స్ లోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ లోని వేసిన స్పెషల్ సెట్స్ లో షూట్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.

అయితే ఇప్పుడు ఓజీ సెట్స్ కు కూడా త్రివిక్రమ్ వస్తున్నట్లు తెలుస్తోంది. సుజీత్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారని సమాచారం. క్రమం తప్పకుండా పవన్ తో మాటల మాంత్రికుడు సెట్స్ కు వెళ్తున్నారని వినికిడి. స్పెషల్ టిప్స్ కూడా డైరెక్టర్ కు ఇస్తున్నారట. మొత్తానికి పవన్ ఎక్కడుంటే.. త్రివిక్రమ్ అక్కడే ఉంటున్నారన్నమాట.

అదే సమయంలో త్రివిక్రమ్.. గుంటూరు కారం మూవీ తర్వాత మరో మూవీని అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ తో సినిమా తీస్తారని టాక్ వచ్చినా.. ఇప్పుడు ఆయన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. బన్నీ మూవీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ తో ఓ సినిమా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అటు తన వర్క్స్ తో బిజీగా ఉంటూనే.. ఇప్పుడు పవన్ వెంట సెట్స్ కు వెళ్తున్నారు.

Tags:    

Similar News