నెవ్వర్ బిఫోర్ అనేలా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కథ
ఇటీవల వెంకటేష్ హీరోగా ఓ కామెడీ ఎంటర్టైనర్ కి కథ రాసిన త్రివిక్రమ్, ఆ ప్రాజెక్ట్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో స్టార్ట్ చేయబోతున్నారు.;
ఇప్పుడు దర్శకులంతా మైథాలజికల్ సినిమాల పట్ల ఆసక్తి కనబరిచే ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా భారీ విజువల్స్, విభిన్నమైన కథలతో తెరకెక్కించడానికి చాలా మంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరనున్నారని సమాచారం. ఆయన చేసే సినిమాల్లో డైలాగ్స్ ఎంత పదునుగా ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట.
ఇటీవల వెంకటేష్ హీరోగా ఓ కామెడీ ఎంటర్టైనర్ కి కథ రాసిన త్రివిక్రమ్, ఆ ప్రాజెక్ట్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో స్టార్ట్ చేయబోతున్నారు. ఆ సినిమా మాత్రం 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా, నిజమైన సంచలనం మాత్రం ఎన్టీఆర్ సినిమా విషయంలోనే ఉందట. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ కెరీర్‌లో తొలి మైథాలజికల్ సినిమా.
త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం గత ఏడాది నుంచే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు. పూర్తిగా దేవుళ్ళ నేపథ్యం ఉన్న చిత్రమని టాక్. ఇందులో ఎన్టీఆర్ పాత్రను శక్తిమంతంగా, ఆధ్యాత్మికంగా చూపించేందుకు త్రివిక్రమ్ భారీ హోంవర్క్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ 2026 చివరలో ప్రారంభం కానుందట. అంటే అప్పటివరకు త్రివిక్రమ్‌కు పూర్తి ప్రీ ప్రొడక్షన్ టైమ్ లభిస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి అనే దానిపైనే ప్రధాన ఫోకస్ పెట్టారు.
ఇది సాధారణ సినిమా కాదని తెలిసిన త్రివిక్రమ్ టీమ్ ఇప్పటికే టాప్ వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్లను సంప్రదించిందట. ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించి గ్రాఫిక్స్‌ను అత్యుత్తమంగా చూపించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొత్తం ప్రీ వర్క్ పూర్తి అయ్యాకే షెడ్యూల్స్ ప్రారంభించాలన్నదే త్రివిక్రమ్ ఆలోచన.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుంది. బడ్జెట్ పరంగా, టెక్నికల్‌గా త్రివిక్రమ్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది త్రివిక్రమ్‌కు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్‌లోనూ ఓ బిగ్ సినిమా అవుతుంది. మొత్తానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనిలో మునిగిపోయారు. ఇంతవరకూ చేసిన సినిమాలు చూసిన వారికి ఇది పూర్తిగా విభిన్నంగా ఉండబోతోంది. ఆయన మైథాలజీ మీద ఉన్న పట్టు స్క్రీన్ పై ఎలా కనబడుతుందో చూడాలి.