ఒంట‌రి దీవిలో ఒంట‌రిగానే.. త్రిష హైడ్ అండ్ సీక్ గేమ్?

తాజాగా విదేశాల(ఆస్ట్రేలియా)లోని ఒక ఒంటరి దీవిలో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోలను పంచుకుంటూ త్రిష ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు.

Update: 2026-07-30 04:15 GMT

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ తో త‌న సాన్నిహిత్యం గురించి మీడియా హైప్ క్రియేట్ చేస్తున్న కొద్దీ దానిని లైట్ తీస్కుంటూనే ఉన్నారు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణ‌న్. రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుని.. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనతో తనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న వార్తలపై స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చాలా సీరియస్‌గా ఏమీ స్పందించడం లేదు. మీడియా ఎంతగా హైప్ క్రియేట్ చేస్తున్నా త‌ను మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. విజయ్ సిఎమ్‌ కావాలని కోరుకున్న అభిమానులలో త్రిష మొదటి వరుసలో ఉంటారు. తమిళనాడులో విజయం సాధించడమే కాకుండా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా వీరిద్దరి బంధం గురించి తమిళ నాట అనేక పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. విజయ్ స్వయంగా త్రిషతో కలిసి కొన్ని సందర్భాల్లో కనిపించడంతో నెటిజన్లు వీరిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

పలు సందర్భాలలో త్రిష ఎంతో ఎమోషనల్‌గా స్పందిస్తూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని చెప్పే ప్రయత్నం చేసినా.. అభిమానులు లేదా నెటిజన్లు మాత్రం దానిని నమ్మేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు...ఆయన విడాకుల వ్యవహారాలు బయటకు వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో త్రిష పేరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఎంతగా రూమర్లు వచ్చినా ఇద్దరూ బహిరంగంగా వీటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ కథనాలకు అడ్డుకట్ట పడటం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి ఫొటో.. క్యాప్షన్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా విదేశాల(ఆస్ట్రేలియా)లోని ఒక ఒంటరి దీవిలో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోలను పంచుకుంటూ త్రిష ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. బ్రౌన్ కలర్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్ ధరించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ``పట్టించుకోకుండా గడపడం అనేది మన ఎంపిక. దాన్ని ఎంచుకోండి... స్మైల్..! అని రాసుకొచ్చారు. తాను ఇంకా ఒంటరిగానే ఉన్నానని చెప్పకనే చెబుతూనే.. రూమర్లను లైట్ తీసుకోమని సందేశం ఇచ్చినట్లు ఈ పోస్ట్ ఉంది.

ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా (జూన్ 22) త్రిష పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను ఊపేసింది. కేక్‌ల ముందు విజయ్ కూర్చుని ఉండగా.. అత‌డి వైపు త్రిష ఎంతో ఆప్యాయంగా చూస్తున్న ఒక ప్ర‌త్యేక‌మైన ఫోటోను షేర్ చేస్తూ.. ``ప్రతిదానికీ ఓ అర్థాన్ని ఇచ్చే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు`` అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ ఆ సమయంలో ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది. వీరి బంధంపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్- త్రిషలు అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్-స్క్రీన్ జోడీగా పాప‌ల‌ర‌య్యారు. గతంలో వచ్చిన గిల్లి, తిరుపాచి, ఆతి, కురువి చిత్రాల నుంచి ఇటీవల వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్ `లియో` వరకు వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎంతో గొప్ప‌ విజయం సాధించింది. అయితే వెండితెరపై కనిపించే ఈ కెమిస్ట్రీ నిజ జీవితంలోనూ ఉందంటూ నెటిజన్లు ప్ర‌చారం చేస్తున్న క్ర‌మంలో.. ఈ `హైడ్ అండ్ సీక్ గేమ్` ఎటు దారితీస్తుందోనని కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News