`స్పిరిట్` కి సలహాలు ఆయన తీసుకుంటాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` పనులు వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` పనులు వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. `రాజాసాబ్`, `పౌజీ` పూర్తయిన వెంటనే పట్టాలెక్కించాలని సందీప్ సిద్దమ వుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా పూర్తిచేస్తున్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ గా `యానిమల్` బ్యూటీ త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేసాడు. అయితే త్రిప్తి ఎంపిక ప్రభాస్ అభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదు.
త్రిప్తీని సెకెండ్ లీడ్ కి తీసుకున్నారని...ప్రధాన నాయిక కాదంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్-త్రిప్తీ పక్కన మ్యాచ్ అవ్వదని..కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవ్వదంటున్నారు. మరికొందరైతే ఫలానా నాయి కైతే బాగుంటుందని సందీప్ రెడ్డికి సలహాలు కూడా ఇస్తున్నారు. మృణాల్ ఠాకూర్ , శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి త్రిప్తీ డిమ్రీ మెయిన్ లీడ్ పోషిస్తుందా? సెకెండ్ లీడ్ కు తీసుకున్నారా? అన్నది మేకర్స్ కన్పమ్ చేయాలి.
`యానిమల్` చిత్రంలో త్రిప్తీ డిమ్రీ పాత్ర కోసం చాలా మంది భామల్ని పరిశీలించాడు సందీప్. కానీ ఎవరూ సెట్ కాలేదు. అప్పటికే త్రిప్తీ డిమ్రీ ప్లాప్ ల్లో ఉంది. కొత్త అవకాశాలు రావడం లేదు. సరిగ్గా అదే సమయంలో అమ్మడు సందీప్ కు తారస పడింది. తాను రాసుకున్న పాత్రకు త్రిప్తీ పర్పెక్ట్ గా భావించి అప్పటికప్పుడు ఎంపిక చేసాడు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసాడు. హీరోయిన్ల ఎంపిక విషయంలో సందీప్ తీరు అలా ఉంటుంది.
ఆయన విజన్ లో హీరోయిన్ ఇలా ఉండాలి అనే ఐడియా ఉంటుంది. అలాంటి భామ కనపడితే ఆమె సినిమా నటి కాకపోయినా ఎలాగైన తన సినిమాకు ఒప్పించే టైప్. అలాంటి మేకర్ అభిమానుల మాటలు వింటాడా? వాళ్లు సూచించిన భామల్ని పరిశీలిస్తాడా? అన్నది చూడాలి.