త్రిప్తి దీమ్రీ.. బీచ్ లో క్యూట్ గ్లామర్ ట్రీట్

ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న ఉన్నప్పటికీ, త్రిప్తి తన రెండు సీన్స్ తోనే ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.

Update: 2024-05-23 16:30 GMT

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి సమయం పట్టడం సహజమే. కొన్ని సార్లు సరైన పాత్ర దొరికే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇక త్రిప్తి దిమ్రి అదే తరహాలో కాస్త ఆలస్యంగా క్రేజ్ అందుకుంది. ఆమెకు ఇటీవల విడుదలైన 'యానిమల్' సినిమాలో జోయా పాత్ర ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న ఉన్నప్పటికీ, త్రిప్తి తన రెండు సీన్స్ తోనే ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.

త్రిప్తి దీమ్రీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదిస్తోంది. రోజురోజుకూ ఆమెకు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వైపుల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఆమె గ్లామర్ ఫోటోషూట్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఆమె ప్రముఖ బీచ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

అలా గాలికి ఎగురుతున్న కురులు, ఆమె హావభావాలు వీడియోలో మరింత హైలెట్ గా నిలిచాయి. ఇక ఆమె సింపుల్ డ్రెస్సింగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక అంతకుముందు త్రిప్తి బికినీ ఫోటోషూట్ లో కూడా మెరిసింది. కానీ ఈ కొత్త ఫోటోషూట్ లో ఆమె మరింత అందంగా కనిపించింది. నెటిజన్లు ఆమె ఫోటోలకు పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.

ఇక ఆమెకు మరిన్ని మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. 'యానిమల్' సినిమాలో జోయా పాత్ర ద్వారా త్రిప్తి రొమాంటిక్ సన్నివేశాల్లోనే కాకుండా, ప్రేమను చూపించే క్యూట్ గర్ల్ గా కూడా ప్రత్యేకంగా నిలిచింది. మొత్తానికి ఆమె ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా చూసిన తర్వాత ఈ బ్యూటీ ఎవరో అని చాలామంది సెర్చ్ చేశారు.

Read more!

త్రిప్తి ఇంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ, అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే టాలీవుడ్ లో కూడా కొన్ని ఆఫర్లు వస్తున్నాయి. త్రిప్తి ఒక మంచి మీడియం రేంజ్ హీరోతో సక్సెస్ అందితే, ఆమె రాబోయే రోజుల్లో టాప్ హీరోయిన్స్ కి కూడా పోటీ ఇస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆమె గ్లామర్, నటన దక్షతలతో ఇండస్ట్రీలో మరింత క్రేజ్ సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.



Tags:    

Similar News