భాగ్య శ్రీ బోర్సే చెల్లెలులా ఉందే!
ఇంతకీ ఎవరా బ్యూటీ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె పేరు త్రిప్తీ రవింద్ర. కోలీవుడ్ లో `తిరుమగన్` చిత్రంతో లాంచ్ అవుతుంది.;
మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు. అప్పుడప్పడు అది నిజమే అనిపిస్తుంది. ఒకే ముఖం..హవభావాలు కలిగిన వారిని చూసినప్పుడు ఇలాంటి వారిని ఎక్కడో చూసామే అన్న భావన కలుగుతుంది. అలాంటప్పుడే ఏడుగురుంటారు అన్నది నిజమే అనిపిస్తుంది. తాజాగా కోలీవుడ్ లో ఓ యువ నాయిక అచ్చంగా భాగ్య శ్రీ బోర్సే పోలికలతో దిగిపోయింది. కళ్లు..ముక్కు..చెవులు..పళ్లు వరుస ..పెదాలు అచ్చంగా భాగ్య శ్రీ కి అచ్చు గుద్దినట్లే ఉంది. టాప్ టూ బాటమ్ దగ్గరగా పరిశీలిస్తే భాగ్య శ్రీ బోర్సే చెల్లెలా? అనిపించక మానదు.
ఇంతకీ ఎవరా బ్యూటీ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె పేరు త్రిప్తీ రవింద్ర. కోలీవుడ్ లో `తిరుమగన్` చిత్రంతో లాంచ్ అవుతుంది. అమ్మడి స్వస్థలం మహరాష్ట్రలోని ధూలే నగరం. ఇంజనీరింగ్ పూర్తిచేసింది. సినిమాలంటే చిన్న నాటి నుంచి ఫ్యాషన్. దీంతో స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎన్నో షోలు చేసింది. ఐదేళ్ల పాటు నాటకాల్లో నటించిన తృప్తి అటు పై వాణిజ్య ప్రకటనల వైపు మళ్లింది. అలా టీవీ ల్లో కనిపించింది. యోగా, డాన్సు లోనూ మంచి అనుభవం ఉంది. కోలీవుడ్ లో లాంచ్ అవ్వడంపై అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది.
కెరీర్ ఆరంభంలోనే విజయ్ ఆంటోనీ చిత్రంలో నటించడం జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతిగా పేర్కొంది. ఈ సినిమాని ఆయన స్వయంగా నిర్మిస్తున్నారు. నవ నాయికల్ని పరిచయం చేయడంలో విజయ్ ముందుంటారు. గతంలో పలువురు భామల్ని పరిచయం చేసిన అనుభవం ఆయన సొంతం. తాను హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్లతో పాటు, కొత్త కొత్త టెక్నీషియన్లను పరిచయం చేస్తుంటారు. అలాంటి వాళ్లలో కొంత మంది ఇప్పటికే పలు ఇండస్ట్రీలో బిజీగా మారారు. మరి తృప్తి రవీంద్ర కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. నటన పరంగా అమ్మడికి తొలి సినిమా ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.
ఇదే నెలలో ఆ చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ సంగతి పక్కన బెడితే తృప్తి రవీంద్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుపు చీరలో అమ్మడు సహజ అందంతో ఆకట్టుకుంటుంది. తెలుపు చీరను మ్యాచ్ చేస్తూ ఒడిలో గుభాళించే సన్నజాజిలు చూడొచ్చు. మరో పిక్ లో పింక్ అండ్ ఆరేం జ్ కాంబినేషన్ చీర...రవికలో అంతే ఆకట్టుకుంటుంది. చేతికి బ్యాంగిల్స్ ...మెడలో బంగారు ఆభరణాలతో మరింత అందంగా హైలైట్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.