దీపికకు 'స్పిరిట్' బ్యూటీ మరో షాక్ ఇచ్చిందా?
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి. రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీతో పాపులారిటీని సొంతం చేసుకున్న త్రిప్తి ఈ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది.;
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి. రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీతో పాపులారిటీని సొంతం చేసుకున్న త్రిప్తి ఈ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తనకు జోడీగా త్రిప్తి దిమ్రి నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన డైలాగ్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దీనిపైనే త్రిప్తి భారీ ఆశలు పెట్టుకుందట. సందీప్ `యానిమల్`లో త్రిప్తి సెకండ్ హీరోయిన్‌గా కీ రోల్ పోషించడం, ఆ క్యారెక్టర్ క్లిక్ కావడం..త్రిప్తికి మంచి మైలేజ్‌ని అందించడం తెలిసిందే. దాని తరువాత మెయిన్ లీడ్‌గా సందీప్ తనకు ప్రమోషన్ ఇచ్చి `స్పిరిట్` కోసం దించేశాడు. దీంతో తనకిది బిగ్ బ్రేక్ మూవీ కాబోతోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
వచ్చే ఏడాది భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే త్రిప్తి దిమ్రి ..క్రేజీ స్టార్ దీపకా పదుకోన్‌కు డబుల్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు `స్పిరిట్` కోసం దీపికని అనుకున్నారు. అయితే పని గంటలు, రెమ్యునరేషన్, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకుంది. దాంతో సందీప్ రెడ్డి వంగ తన స్థానంలో త్రిప్తి దిమ్రిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడు.
ఇక దీనికి ముందు కూడా దీపిక మరోఆఫర్‌ని త్రిప్తి గ్రాబ్ చేసింది. అదే `ఓ రోమియో`. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న మూవీ ఇది. ఇందులో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. స్వాతంత్రానంతరం ముంబాయిలో మొదలైన అండర్ వరల్డ్ కార్యకలాపాల నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా దీన్ని విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్నాడు. షాహీద్‌కు జోడీగా ముందు దీపకనే అనుకున్నారట. అది లేడీ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. దీనికి చాలా వరకు శారీరకంగా రిస్క్ చేయాలట. అయితే దీపికకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా తను శారీరక ఒత్తిడికి గురయ్యే విషయాలకు దూరంగా ఉండాలని సూచించారట.
దీంతో డాక్లర్ల సలహా మేరకు దీపిక `ఓ రోమియో` ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, తన స్థానంలో త్రిప్తిని తీసుకున్నారని తెలిసింది. దీంతో దీపిక రెండు ప్రాజెక్ట్‌లని త్రిప్తి దిమ్రి సొంతం చేసుకుందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్‌లు చేస్తున్నారు. షాహీద్‌తో కలిసి త్రిప్తి దిమ్రి నటించిన `ఓ రోమియో` ఫిబ్రవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.