క్యూటీ పూల్ సైడ్ స్పెషల్ ట్రీట్
క్యూట్ లుక్స్ తో కుర్రకారు హృదయాలను గెలుచుకున్న యంగ్ బ్యూటీ త్రిథా చౌదరి.;

క్యూట్ లుక్స్ తో కుర్రకారు హృదయాలను గెలుచుకున్న యంగ్ బ్యూటీ త్రిథా చౌదరి. హిందీ, బెంగాళీ, తెలుగు చిత్రాలలో నటిస్తున్న ఈ భామ `ఆశ్రమ్` వెబ్ సిరీస్ లో వేడెక్కించే పెర్ఫామెన్సెస్ తో మతులు చెడగొట్టింది. త్రిథా ఈ సిరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఇప్పటికే అరడజను పైగా వెబ్ సిరీస్ లలో నటించి తన ప్రతిభను నిరూపించింది. సినిమాల పరంగాను బోల్డ్ కంటెంట్ కి అభ్యంతరం చెప్పని భామగా గుర్తింపు పొందింది.

మరోవైపు త్రిథా వరుస ఫోటోషూట్లు ఇన్ స్టాలో అగ్గి రాజేస్తున్నాయి. ఈ క్యూటీ గ్లామర్ ఎలివేషన్ కి ఎంతమాత్రం అభ్యంతరం చెప్పదు. తాజా ఫోటోషూట్ లో త్రిథా పూల్ సైడ్ అర్థనగ్నంగా కనిపించింది. కొలనులో ఈదేందుకు సిద్ధమైన త్రిథా థై సొగసులను ఆవిష్కరిస్తూ కొంటెగా ఫోజులిచ్చింది. అయితే స్విమ్ చేయడానికి వెళుతూ ఇలాంటి ఫుల్ హ్యాండ్ డ్రెస్ తొడుక్కోవడం ఆశ్చర్యపరుస్తోంది. గాజు గ్లాసు, అందులో పానీయం, నిమ్మకాయ ఈ కాంబినేషన్ ఏమిటో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు.
త్రిధా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోటి భావనలు మదిలో మెదిలేలా అందమైన లుక్కుతో కట్టి పడేస్తోంది. అదే సమయంలో క్యూటీ .. హాటీ .. లవ్ లీ అంటూ యూత్ కోరస్ పాడుతూ త్రిథానే తథేకంగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం త్రిథా ఏ సినిమాలో నటిస్తోందో వెల్లడించలేదు. తదుపరి ప్రాజెక్టులపై అప్ డేట్ ఇస్తుందేమో చూడాలి.