త్రిధా చౌధరీ టాటూ చూశారా?.. హీట్ పుట్టించేసిందిగా!

త్రిధా చౌధరీ.. ఈ పేరు ఎక్కడో ఉన్నట్లు ఉంది కదా.. బెంగాల్ కు చెందిన ఆ బ్యూటీ తెలుగు ఆడియన్స్ కు కూడా సుపరిచితమే.;

Update: 2025-11-27 19:30 GMT

త్రిధా చౌధరీ.. ఈ పేరు ఎక్కడో ఉన్నట్లు ఉంది కదా.. బెంగాల్ కు చెందిన ఆ బ్యూటీ తెలుగు ఆడియన్స్ కు కూడా సుపరిచితమే. కోల్ కతాలో చదివిన ఆమె.. బెంగాలీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ పాపులర్ అయింది. మిషావర్ రాహోష్యో మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తనదైన యాక్టింగ్ తో ఫిదా చేశారని చెప్పాలి.




ఆ తర్వాత యంగ్ హీరో నిఖిల్ లీడ్ రోల్ లో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సూర్య వర్సెస్ సూర్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిధా చౌధరీ. అనుకున్న రేంజ్ లో ఆ సినిమా ఆడకపోయినా ఆమె యాక్టింగ్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మనసు నచ్చింది చిత్రంలో కనిపించారు అమ్మడు.

ఆ సినిమా కూడా ఫ్లాప్ అయినా.. ఆ తర్వాత 7, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా అవి ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగులో ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. కానీ అటు బెంగాలీలో, బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది త్రిధా చౌధరీ.

ప్రస్తుతం కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్న అమ్మడు.. మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ ను త్రిధా చౌధరీ షేర్ చేస్తుండగా.. అవి నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంటాయి. అందరినీ తెగ మెప్పిస్తుంటాయి. నెటిజన్లను ఫిదా కూడా చేస్తుంటాయి.

అయితే రీసెంట్ గా త్రిధా చౌధరీ టాటూకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఓ కార్యక్రమానికి బ్లూ కలర్ డీప్ డ్రెస్ వేసుకుని వచ్చిన అమ్మడు.. డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. ఆ సమయంలో త్రిధా టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటోంది.

బ్యూటీ టాటూ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. వావ్ అనేలా ఉందని అంటున్నారు. అదే సమయంలో హీట్ కూడా పుట్టిస్తుందని చెబుతున్నారు. స్లో గ్లామరస్ మేడమ్ అంటున్నారు. త్రిధా చౌధరీ బాడీపై టాటూ కనిపిస్తున్న వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఫుల్ వైరల్ కూడా చేస్తున్నారు.

Tags:    

Similar News