గ్రాండ్ పేరెంట్స్‌కి ‘త్రిబాణధారి బార్బరిక్’ స్పెషల్ గిఫ్ట్!

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, కథలోని భావోద్వేగం, ఆధ్యంతం ఆకట్టుకునే మెసేజ్ ఉంటే వెంటనే కనెక్ట్ అవుతున్నారు.;

Update: 2025-08-29 13:39 GMT

తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే అస్సలు వదిలిపెట్టడం లేదు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, కథలోని భావోద్వేగం, ఆధ్యంతం ఆకట్టుకునే మెసేజ్ ఉంటే వెంటనే కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను హైలైట్ చేసే చిత్రాలకైతే థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా మొదటి షో నుంచే ఫ్యామిలీ ఆడియెన్స్‌ మన్ననలు అందుకుంది. చిన్న చిన్న ప్రీమియర్లతో మౌత్‌టాక్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్‌కి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆకర్షిస్తోంది.

సినిమా విడుదలైన రోజు నుంచే గ్రాండ్ పేరెంట్స్‌కి సంబంధించిన ఎమోషన్స్ బలంగా ఫీలయ్యేలా కథను డిజైన్ చేశారు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఇలా ప్రతి వయస్సు వారికి కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ సినిమాలో తాత, మనవరాలి బాండింగ్‌ ప్రత్యేకంగా నిలిచింది. వానర సెల్యూలాయిడ్‌ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రానికి మారుతి సమర్పకుడు, మోహన్ శ్రీ వత్స దర్శకుడు. సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట సింహా, సత్యం రాజేష్, సాంచీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ప్రస్తుతం ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వచ్చే వారం సెప్టెంబర్ 7న గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాయంత్రం ఫస్ట్ షో కోసం సినిమాను చూడడానికి వచ్చే ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ఎంట్రీ ఇవ్వనున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా ఇద్దరికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.

ఈ కథ తాత మనవరాలి బంధాన్ని, కుటుంబ విలువలను, సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తుందనే నమ్మకంతోనే వాస్తవానికి ఇలా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమా.. ఇప్పుడు ఉచిత టికెట్ల ఆఫర్‌తో మరిన్ని కుటుంబాలను థియేటర్ వైపు రప్పించనుంది.

అసలే థియేటర్‌కి కుటుంబాల రాక తగ్గిన ఈ రోజుల్లో, ఇలా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం ద్వారా సినిమాకు మాత్రమే కాదు, ఓ పెద్ద జ్ఞాపకాన్నీ మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. వయోజనులతో పాటు పిల్లలు, మహిళలు కూడా తమ తాత, మామ, అమ్మమ్మలతో కలిసి థియేటర్‌కి వెళ్లేలా చేస్తున్న ఈ ఆఫర్ స్పెషల్. ఇప్పటికే జరిగిన ప్రీమియర్లలోనే పెద్దవాళ్లూ, పిల్లలూ కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ షో నుంచే మంచి మౌత్‌టాక్ వచ్చింది. దీంతో సినిమాకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News