'టాక్సిక్' మెల్లిసా.. వైల్డ్ వరల్డ్ లో లవ్లీ బ్యూటీ
ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఇతర పాత్రల పరిచయాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.;
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై అంచనాలు పెంచాలని మేకర్స్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుండి వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఇతర పాత్రల పరిచయాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. లేటెస్ట్ గా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో రుక్మిణి 'మెల్లిసా' అనే పాత్రలో కనిపించనుంది. గతంలో సాఫ్ట్ రోల్స్ లో ఆడియన్స్ ని మెప్పించిన రుక్మిణి, ఇందులో పూర్తిగా డిఫరెంట్ స్టైలిష్ అవతార్ లో దర్శనమిస్తోంది.
రిలీజ్ చేసిన పోస్టర్ లో రుక్మిణి లుక్ చాలా గ్రాండ్ గా ఉంది. బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్ లో, ఒక పబ్ లేదా పార్టీ వాతావరణంలో ఆమె నడుచుకుంటూ వస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. చుట్టూ జనం ఉన్నా, ఆమె మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా, సీరియస్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె చూపుల్లో ఏదో తెలియని తెగువ, గాంభీర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
"ఆమె గుంపులో కలిసిపోయే రకం కాదు.. ప్రత్యేకంగా నిలబడే రకం" అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఈ పాత్ర స్వభావాన్ని చెప్పకనే చెబుతోంది. మెల్లిసా పాత్ర కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదని, కథలో బలమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అర్థమవుతోంది. గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పవర్ ఫుల్ పాత్రని ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.
డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఈ సినిమాను ఒక అద్భుత కథ అని చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పాత్రల ఎంపిక, వాళ్ళ గెటప్స్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇప్పటికే రివీల్ అయిన పాత్రలతో పాటు ఇప్పుడు రుక్మిణి వసంత్ ఎంట్రీతో క్యాస్టింగ్ చాలా బలంగా మారింది. యష్ లాంటి మాస్ హీరో పక్కన ఇలాంటి స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్స్ ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇలాంటి క్రేజీ అప్డేట్స్ ఇస్తూ సినిమాను నిరంతరం వార్తల్లో నిలుపుతున్నారు. రుక్మిణి వసంత్ పోషించే మెల్లిసా పాత్ర యష్ తో ఎలా ట్రావెల్ అవుతుందో, ఈ క్రైమ్ డ్రామాలో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.