ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారా? యష్ మూవీ పై ఫ్యాన్స్ టెన్షన్
రాఖీ భాయ్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.
రాఖీ భాయ్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన 'తబాహి' వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యష్, కియారా అద్వానీల మధ్య ఉన్న ఘాటు రొమాన్స్, కిస్సింగ్ సీన్లు యూత్‌కు కిక్ ఇస్తున్నా, మరోవైపు యష్ ఫ్యాన్స్‌లో మాత్రం ఒక పెద్ద టెన్షన్‌ను మొదలుపెట్టాయి. ఈ అడల్ట్ కంటెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమవుతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
యష్, కియారాల మధ్య ఘాటు రొమాన్స్:
ఆగస్ట్ 26న విడుదల కాబోతున్న ‘టాక్సిక్’ సినిమా బజ్ పెంచడానికి మేకర్స్ కంటెంట్‌ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన 'తబాహి' వీడియో సాంగ్‌లో రెగ్యులర్ లిరిక్స్ కాకుండా ఒరిజినల్ విజువల్స్ చూపించారు. ఇక ఇల్లు, క్లబ్బులు, బీచ్ ఇలా ఎక్కడ పడితే అక్కడ యష్, కియారాల రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా కియారా అద్వానీ తన గ్లామర్, లైవ్ ఎక్స్‌ప్రెషన్లతో యూత్‌ను కట్టిపడేసింది. థియేటర్లలో ఈ రచ్చ ఏ స్థాయిలో ఉంటుందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రాఖీ భాయ్ ఇమేజ్‌కు దెబ్బ పడుతుందా?:
ఇలాంటి రొమాంటిక్ పాటలు సినిమాల్లో కొత్తేమీ కాకపోయినా, యష్ సినిమా కావడంతోనే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 'KGF' సిరీస్ తర్వాత యష్‌కు చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్లీన్ మాస్ ఇమేజ్ వచ్చింది. కానీ, ‘టాక్సిక్’ టీజర్ నుండి ఈ పాట వరకు ప్రతి ప్రమోషన్‌లోనూ రొమాన్స్, అడల్ట్ ఎలిమెంట్స్‌ను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఇక దీనివల్ల 18 ఏళ్ల లోపు ఉన్న ఫ్యాన్స్, ఫ్యామిలీలు థియేటర్లకు రావడానికి వెనకాడుతారేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
గ్లామర్ గాల్స్ మధ్య కియారాకే ప్రాధాన్యత:
ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు నటిస్తున్నప్పటికీ, యష్ ప్రియురాలిగా కియారా అద్వానీకే ఎక్కువ స్క్రీన్ స్పేస్, ఇంపార్టెన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఇక స్కిన్ షోకు అస్సలు మొహమాటపడని ఈ బాలీవుడ్ బ్యూటీ, రీసెంట్‌గా 'వార్ 2' లోనూ హొయలు ఒలికించింది.
డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో కానీ, ప్రస్తుతానికైతే ‘టాక్సిక్’కు కావలసినంత బజ్ ఈ రొమాంటిక్ కంటెంట్ వల్లే వస్తోంది. మాస్ యాక్షన్‌తో పాటు ఈ బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు ప్లస్ అవుతాయా, లేక ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేస్తాయా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఇక రాఖీ భాయ్ క్రేజ్ ముందు ఈ టెన్షన్లు పటాపంచలు అవుతాయని కూడా కొందరు గట్టిగా నమ్ముతున్నారు..