స్పైడర్-మ్యాన్ ఫ్యాన్స్ అదిరిపోయే సందడి
ముఖ్యంగా `స్పైడర్-మ్యాన్, నామ్ తో సునా హోగా` అంటూ షారుఖ్ ఖాన్ డైలాగ్‌తో కూడిన పోస్టర్లు, `సారీ టాం మాస్క్ నీకే బాగుంటుంది` అని రాసి ఉన్న హోర్డింగ్‌లు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాలండ్ ముంబై పర్యటన మార్వెల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన నటించిన తాజా చిత్రం `స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే` విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో సందడి చేయడమే కాకుండా నగరం అంతటా ఆసక్తికరమైన.. హాస్యభరితమైన హోర్డింగ్‌లను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు స్థానికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా `స్పైడర్-మ్యాన్, నామ్ తో సునా హోగా` అంటూ షారుఖ్ ఖాన్ డైలాగ్‌తో కూడిన పోస్టర్లు, `సారీ టాం మాస్క్ నీకే బాగుంటుంది` అని రాసి ఉన్న హోర్డింగ్‌లు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సృజనాత్మక ప్రయత్నాలు నగరంలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ పర్యటనలో భాగంగా అభిమానుల నుండి లభించిన ఆత్మీయ స్వాగతం ఆయన్ని ఎంతో ఆకట్టుకుంది. స్టార్ హీరో పట్ల అభిమానులు చూపిన ప్రేమ, భారతీయ ప్రేక్షకులు అంతర్జాతీయ స్థాయి చిత్రాలను ఎంతగా ఆదరిస్తున్నారో? చెప్పడానికి నిదర్శనం.
`స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే` చిత్రం విషయానికి వస్తే ఇది `నో వే హోమ్` సంఘటనల తర్వాత నాలుగు సంవత్సరాలకు సాగే కథ. పీటర్ పార్కర్ ప్రపంచం మర్చిపోయిన ఒక హీరోగా తన పోరాటాన్ని ఎలా కొనసాగి స్తున్నాడనేది చిత్ర ప్రధానాంశం. సినిమాలో జెండయా, జాకబ్ బాటలాన్ వంటి నటీనటులతో పాటు, కొత్త త్రెట్‌గా రాబోతున్న విలన్ పాత్ర అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
భారతదేశంలో ఈ చిత్రం జూలై 30న ఆరు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా మల్టిపుల్ ప్రీమియం ఫార్మాట్లలో అందుబాటులో ఉండనుంది. టెక్నికల్ పరంగా కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్‌కు ముందే ఇలాంటి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం సినిమాకు ఊహించని పబ్లిసిటీని తీసుకొస్తుంది. ఇండియాలో టామ్ హాలండ్ క్రేజ్ ఏ స్థాయి ఉందో చెప్పడానికి ముంబై పర్యటన ఓ నిదర్శనంగా నిలిచింది.