టాలీవుడ్.. ఆ రోజు ఏకంగా మూడు!

టాలీవుడ్ లో లో పెద్ద సినిమాల సందడి ఈ నెల నుంచే ఆరంభం అయ్యింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Update: 2024-05-14 10:16 GMT

టాలీవుడ్ లో లో పెద్ద సినిమాల సందడి ఈ నెల నుంచే ఆరంభం అయ్యింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అదే సమయంలో కాస్తా బజ్ ఉన్న మూవీస్ ఈ నెలలో థియేటర్స్ లోకి వస్తున్నాయి. దాంతో పాటు జూన్ నుంచి ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ టాలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇవన్నీ కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

ఇక ఈ నెలలో సినిమాలకి సంబందించిన కొన్ని అప్డేట్స్ ని ఆయా చిత్ర దర్శకులు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ సాంగ్ ని మే 20న రిలీజ్ కాబోతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో దేవర ఫస్ట్ సాంగ్ తో అతనికి బర్త్ డే విషెష్ చెప్పాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అనిరుద్ రవిచందర్ దేవర చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ దేవర చిత్రంపై ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అనిరుద్ రవిచందర్ సాంగ్స్ కి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. దీంతో కచ్చితంగా ఓ మంచి సాంగ్ వింటామనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. అదే రోజు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్ ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు.

ఈ విషయాన్ని మంచు విష్ణు ఒక పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. అలాగే మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీకి సంబందించిన అప్డేట్ కూడా మే 20న ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. దాంతో పాటు తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ మిరాయ్ ప్రతినాయకుడి గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారని టాక్.

Read more!

పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మిరాయ్ చిత్రంలో కూడా తేజా సజ్జా సూపర్ హీరో క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. మిరాయ్ మూవీలో తేజా సజ్జాకి విలన్ గా ఎవరు చేస్తున్నారనేది. మొత్తానికి నాలుగు సినిమాలకి సంబందించిన కీలక అప్డేట్స్ ని మే 20న పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి. మరి వీటిలో ఏవి ప్రేక్షకులని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News