కెరీర్, మూవీస్ అలా.. కానీ రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్!

అయితే ఇప్పటికే వివిధ సినిమాలతో సదరు హీరో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీలు మెచ్చే కాన్సెప్టులతో రూపొందించే చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.;

Update: 2025-09-10 17:30 GMT

టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. అదే సమయంలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను దక్కించుకున్నారు. వర్సటైల్ యాక్టర్ గా తెలుగు పరిశ్రమలో పేరు పొందారు.

అయితే ఇప్పటికే వివిధ సినిమాలతో సదరు హీరో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీలు మెచ్చే కాన్సెప్టులతో రూపొందించే చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. కానీ కొంతకాలంగా ఆయన నటించిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్స్ కావడం లేదు. పలు సినిమాల్లో నటించినా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నారు.

దీంతో సరైన హిట్ కోసం ఆ యంగ్ హీరో వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో గతేడాది ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పటివరకు మరో సినిమాతో సందడి చేయలేదు. కానీ లైనప్ లో మూడు చిత్రాలు ఉన్నాయి. అయితేనేం.. ఎలాంటి అప్డేట్స్ కూడా రావడం లేదు.

ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ మూవీ మొదలై చాలా కాలం అవుతుంది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఏడాదికిపైగా లేట్ అయింది. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ మధ్య విడుదల తేదీపై రూమర్లు వచ్చినా.. మేకర్స్ గానీ హీరో గానీ ఎక్కడా ఎలాంటి అప్డేట్లు మాత్రం ఇవ్వలేదు.

అదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థతో స్పోర్స్ డ్రామా మూవీ చేస్తున్నారు. ఆ మధ్య కొన్ని అప్డేట్స్ వచ్చినా.. ఆ తర్వాత సౌండ్ లేదు. ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. దానికి ఆర్థిక ఇబ్బందులు కారణమని తెలుస్తోంది. ఇటీవల ఇంకో సినిమా ప్రకటన కూడా వచ్చింది. ఓ ఫెస్టివల్ పేరుతో మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది.

కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. అయితే ఈ మూడు చిత్రాలు వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ సమస్యల వల్లనే లేట్ అవుతున్నాయని వినికిడి. కానీ సదరు హీరో మాత్రం రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదని టాక్ వినిపిస్తోంది. తనకు చెప్పిన పారితోషికం ఇవ్వాలని చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు.

Tags:    

Similar News