వాళ్లను గెలుపు పలకరించేది ఎప్పుడో?
ఎన్ని సినిమాలు చేస్తున్నా? ఫలితాలు తీవ్ర నిరుత్సాహాన్నే మిగులుస్తున్నాయి. దీంతో గెలుపు గుర్రం ఎక్కేది ఎప్పుడంటూ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;
రవితేజ, శర్వానంద్, గోపీచంద్, అఖిల్,కల్యాణ్ రామ్, అల్లరి నరేష్, నితిన్ లాంటి స్టార్లకు కొంత కాలంగా విజయం అందని ద్రాక్షగా మారింది. ఎన్ని సినిమాలు చేస్తున్నా? ఫలితాలు తీవ్ర నిరుత్సాహాన్నే మిగులుస్తున్నాయి. దీంతో గెలుపు గుర్రం ఎక్కేది ఎప్పుడంటూ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ స్టార్ హీరోల స్థానాల ఆర్డర్ మారింది. ఆ హీరోల సినిమాలు పదికోట్ల గ్రాస్ కూడా తీసుకుని పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఇదే సన్నివేశం మరికొంత కాలం కొనసాగితే? మార్కెట్ పరంగా మరింత ప్రతికూలత తప్పదు. మూడేళ్లగా రవితేజ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.
`ధమాకా తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. తాజాగా రిలీజ్ అయిన `మాస్ జాతర` కూడా తీవ్ర నిరుత్సాహన్నే మిగిల్చింది. తదుపరి `భర్తమహాశయుల`తోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అలాగే మరో యంగ్ శర్వానంద్ కి `మహానుభావుడు` తర్వాత సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. చేసిన సినిమాలేవి కలిసి రాలేదు. మధ్యలో రకరకాల జానర్లు ట్రై చేసాడు. అవి నిరుత్సాహపరిచనవే. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఒకేసారి మూడు రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నాడు. `బైకర్`, `నారీ నారీ నడుమ మురారీ`, `భోగీ` సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ మూడు వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్నాయి.
వీటి పై శర్వా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మ్యాచో స్టార్ గోపీచంద్ కి కూడా పక్కా కమర్శియల్ తర్వాత మరో కమర్శియల్ హిట్ పడలేదు. మూడేళ్లగా విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో కమర్శియల్ ప్రయత్నాలు పక్కన బెట్టి! సంకల్ప్ రెడ్డి తో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్కినేని అఖిల్ `మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` తర్వాత హిట్ పడలేదు. ప్రస్తుతం `లెనిన్` లో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది.
ఈ సినిమాతో అఖిల్ భారీ హిట్ కొడతాడనే నమ్మకాలు బలంగా ఉన్నాయి. నందమూరి వారసుడు కల్యాణ్ రామ్ కూడా మూడేళ్లగా విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. `బింబిసార` తర్వాత చేసిన సినమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక నితిన్ హిట్ చూసి ఐదేళ్లు అవుతుంది. `భీష్మ` తర్వాత అన్నీ ప్లాప్ సినిమాలే చేసాడు. ఏ సినిమా యావరేజ్ గా కూడా ఆడలేదు. జులైలో రిలీజ్ అయిన `తమ్ముడు` కూడా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం కొత్త సినిమా పనుల్లో ఉన్నాడు. అలాగే అల్లరి నరేష్ ఖాళీ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ, సరైన ఫలితాలు రావడం లేదు. లైన్ లో ఉన్న `12ఏ రైల్వే కాలనీ`పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. `ఆల్కాహాల్`, `సభకు నమస్కారం` చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.