వారసులే కాదు..వారసురాళ్లు కూడా!
టాలీవుడ్ లో వారసత్వం అంటే? తండ్రి నుంచి తనయుడు వారసత్వాన్ని అందుకోవడమే. మేల్ డామినేషన్ మాత్రమే ఎక్కువగా కనిపించేది.;
టాలీవుడ్ లో వారసత్వం అంటే? తండ్రి నుంచి తనయుడు వారసత్వాన్ని అందుకోవడమే. మేల్ డామినేషన్ మాత్రమే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ లోనూ సన్నివేశాలు మారాయి. హిందీ పరిశ్రమ తరహాలో టాలీవుడ్ నుంచి కుమార్తెలు రంగంలోకి దిగుతున్నారు. నచ్చిన శాఖవైపు వెళ్లడానికి ఎంత మాత్రం వెనకడుగు వేయడం లేదు. ధైర్యంగా ముందుకొచ్చి 24 శాఖల్లో నచ్చిన శాఖను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు నిర్ణయం తీసుకోవడానికే ఎంతో ఆలోచించేవారు. కానీ ఇప్పుడా నిర్ణయం గంటల్లో జరిగిపోతుంది.
టాలీవుడ్ లో ఆ ఐదేళ్ల కాలంలో వచ్చిన ప్రధాన మార్పు ఇది. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి నాగబాబు తనయ నిహారిక నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. క్రియేటివ్ విభాగంలోనూ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా నిర్మాతగా( మనశంకర వరప్రసాద్) ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకూ కెమెరా వెనుక కాస్ట్యూమ్ డిజైనర్ గానే కొనసాగిన సుస్మిత నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి చిరంజీవి ఎంతో గర్విస్తున్నారు. ఫ్యాషన్ ఉన్న వారు నిర్మాణం సహా నచ్చిన శాఖను ఎంచుకుని ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే నటసింహ బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్వీని కూడా నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతున్నారు. బాలయ్య 111వ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ విషయంలో తండ్రి నుంచి అన్ని రకాల సహకారం తేజస్వీకి దక్కుతోంది. త్వరలోనే ఈసిసనిమా ప్రారంభం కానుంది. భవిష్యత్ లో సుస్మిత-తేజస్వీని నిర్మాతలుగా పోటీ పడే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు చిరంజీవి-బాలయ్య సినిమాల మద్య ఎలాంటి పోటీ వాతావరణం ఉండేదో? భవిష్యత్ లో అలాంటి పోటీ సుస్మిత-తేజస్వీ మధ్య ఉండే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అశ్వీనీదత్ వారసత్వాన్ని ఇద్దరు కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్ లు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. విజయవంతమైన చిత్రాలతో నిర్మాతలుగా తమ అభిరుచుని చాటుకుంటున్నారు. భవిష్యత్ లో మరింత మంది వారసురాళ్లు రావడం ఖాయం. నిర్మాణం కంటే? హీరోయిన్లగా ఎంట్రీ ఇవ్వడానికే అవకాశాలున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ముద్దుల కుమార్తె సితార హీరోయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
ఇప్పటికే సినిమాల పట్ల తన ఫ్యాషన్ ని ప్రూవ్ చేసుకుంటోంది. తనయుడు గౌతమ్ వస్తాడా? రాడా? అన్నది పక్కన బెడితే? సితార మాత్రం మామ్ -డాడ్ లను ఒప్పించి మ్యాకప్ వేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.వీరందరికంటే ముందే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల కూడా చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే.