క‌ష్ట కాలంలో పాత సంచ‌ల‌నాలు కొట్టేనా ఓ హిట్!

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఎంత బిజీగా ఉన్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా ట్రెండ్ మొద‌లైన త‌ర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది.;

Update: 2025-12-14 05:10 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఎంత బిజీగా ఉన్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా ట్రెండ్ మొద‌లైన త‌ర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా క్యూలో ఉండాల్సిందే. వాళ్ల టోకెన్ నెంబ‌ర్ ఎప్పుడొ స్తుందా? ప‌క్కాగా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ మ‌ధ్య‌లో మ‌రో కొత్త డైరెక్ట‌ర్ బ్లాక్ బ‌స్టర్ తో వ‌చ్చాడంటే? ఈరోలంతా అత‌డి వైపు చూస్తున్నారు. ప్ర‌తిగా స్టోరీలు ఒకే అయినా డైరెక్ట‌ర్లు కూడా హోల్డ్ లో ప‌డిపోతున్నారు. సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైనా..రెండు మూడేళ్ల‌కు ఒక సినిమా రిలీజ్ అయినా ప‌ర్వాలేద‌న్న‌ట్లు స్టార్ హీరోల‌ మైండ్ సెట్ క‌నిపిస్తుంది.

వాళ్ల కోసం ట్రై చేయాల్సిందే:

ఇంత‌టి ట‌ఫ్ కాంపిటీష‌న్ లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల‌కు వాళ్ల‌తో ఛాన్స్ అంటే దాదాపు క‌ల‌గానే చెప్పాలి. సురేంద‌ర్ రెడ్డి `ఏజెంట్` త‌ర్వాత సైలైంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్రాజెక్ట్ ఉంది? అనే ప్ర‌చారం త‌ప్ప అందులో వాస్త‌వం తెలియ‌దు. ప‌వ‌న్ కొత్త కొత్త ప్రాజెక్ట్ లు గురించి మాట్లాడుతున్నారు త‌ప్ప సూరి ప్రాజెక్ట్ గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు. ప్ర‌స్తుతం సూరి ఉన్న ప‌రిస్థితుల్లో స్టార్స్ ఎవ‌రూ అత‌డితో ముందుకు వెళ్లే అవ‌కాశం లేదు. బిగ్ స్టార్స్ ని ప‌క్క‌న బెట్టి సూరి టైర్ 2, టైర్ 3 హీరోల కోసం సెర్చ్ చేయాలి. అదీ అంత సుల‌భం కాదు.

వాళ్ల చేతుల్లో రాటు దేలిన వారే:

వాళ్లలో చాలా మంది హీరోలు బిజీగానే ఉన్నారు. ఓ ర‌కంగా సూరికిది సెకెండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఇక శ్రీనువైట్ల‌, గుణ‌శేఖ‌ర్, వైవీఎస్ చౌద‌రి, నందిని రెడ్డి, ఎస్ వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ల‌ను తీసుకుంటే? వాళ్లంద‌రికీ ఇది సెకెండ్ ఇన్నింగ్స్ కాదు థ‌ర్డ్ ఇన్నింగ్స్ గా చెప్పొచ్చు. టాలీవుడ్ లో శ్రీను వైట్ల‌, గుణ‌శేఖ‌ర్, కృష్ణారెడ్డి లాంటి వారు ఎలాంటి విజ‌యాలు అందించారో చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కులుగా వారంతా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు స్టార్ హీరోల‌గా నీరాజ‌నాలు అందుకుం టోన్న వారంతా? వారి చేతిలో రాటు దేలినవారే. కొంత కాలం పాటు ఆ సీనియ‌ర్ల ఎరా కొన‌సాగింది.

మ‌ళ్లీ స‌క్సెస్ ఫార్ములాతో:

వ‌రుస విజ‌యాల త‌ర్వాత ప్లాప్ లు ఎదుర‌వ్వ‌డంతో అవ‌కాశాలు త‌గ్గాయి. అయినా డైరెక్ష‌న్ విడిచి పెట్ట‌లేదు. ఇంకా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. గుణ‌శేఖ‌ర్ ఇప్ప‌టికే` యూఫోరియా` అనే చిత్రాన్ని తెర‌కెక్కించి రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఈనెల 25న ఆ చిత్రం విడుద‌ల కానుంది. ఇదొక యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ జాన‌ర్లో గుణ సినిమాలు చేసి చాలా కాల‌మ‌వుతోంది. కెరీర్ ఆరంభంలో ఆ త‌హార చిత్రాలు తెర‌కెక్కించారు. కాల‌క్ర‌మంలో ఆ జాన‌ర్ ని వ‌దిలేసారు. మ‌ళ్లీ ఇంత కాలానికి స‌క్సెస్ ఫార్ములా ప‌ట్టుకుని దిగుతున్నారు.

నంద‌మూరి వార‌సుడితో:

ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ క‌లిసొస్తుందో చూడాలి. కృష్ణారెడ్డి సైతం `వేద వ్యాస్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. షూటింగ్ జాప్యం కార‌ణంగా ప్రాజుక్ట్ అప్ డేట్స్ ఏవీ బ‌య‌ట‌కు రాలేదు. కొత్త ఏడాది ఆ సినిమాకు సంబంధించిన వివ‌రాలు షేర్ చేసే అవ‌కాశం ఉంది. శ్రీను వైట్ల మాత్రం సీరియ‌స్ గా స్టోరీ సిద్దం చేసే ప‌నిలో ఉన్నారు. నిర్మాత‌లు కూడా సెట్ అయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అందులో హీరో? ఎవ‌ర‌న్న‌ది ఖ‌రార‌వ్వాల్సి ఉంది. అలాగే మ‌రో డైరెక్ట‌ర్ వై.వి.ఎస్ చౌద‌రి చాలా కాలానికి ట‌చ్ లోకి వ‌చ్చాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారు డుని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.

లేడీ డైరెక్ట‌ర్ కెరిర్ కి కీల‌కమైంది:

టాలీవుడ్ ఏకైక ట్రెండింగ్ లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి రెండేళ్ల గ్యాప్ అనంత‌రం `మా ఇంటి బంగారం` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి స‌మంత క‌ల్పించిన అవ‌కాశం ఇది. సామ్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందు తుంది. ఇందులో స‌మంత గెస్ట్ రోల్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. వాస్త‌వానికి ఈ చిత్రం ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల‌ని కానీ అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డుతుంది. కొత్త ఏడాది ఆరంభంలోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశం ఉంది. నందిని రెడ్డి కెరీర్ కి ఈ విజ‌యం ఎంతో కీల‌క‌మైందే.

Tags:    

Similar News