కుదిరితే రుక్మిణి.. లేదంటే భాగ్య శ్రీ..!
టాలీవుడ్ లో కొత్త భామల సందడి కనిపిస్తుంది. మొన్నటిదాకా స్టార్స్ గా ఉన్న హీరోయిన్స్ కాస్త వెనక్కి తగ్గగా అందరి చూపు ఈ కొత్త హీరోయిన్స్ వైపు మళ్లింది.;
టాలీవుడ్ లో కొత్త భామల సందడి కనిపిస్తుంది. మొన్నటిదాకా స్టార్స్ గా ఉన్న హీరోయిన్స్ కాస్త వెనక్కి తగ్గగా అందరి చూపు ఈ కొత్త హీరోయిన్స్ వైపు మళ్లింది. అందులో ముఖ్యంగా ఒక ఇద్దరి హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో రెగ్యులర్ డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ఒకరు భాగ్య శ్రీ బోర్స్ కాగా.. మరొకరు రుక్మిణి వసంత్. ఈ అందాల భామల ఇద్దరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.
టాలీవుడ్ లో స్టార్ రేంజ్..
కాంతారా చాప్టర్ 1 తో రుక్మిణి సౌత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అది చాలదు అన్నట్టుగా అమ్మడు ఎన్ టీ ఆర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. తారక్ తో సినిమా అంటే టాలీవుడ్ లో స్టార్ రేంజ్ దక్కినట్టే లెక్క. రుక్మిణికి తెలుగు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూసి దర్శక నిర్మాతలంతా ఆమె కోసం క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. రుక్మిణి కూడా టాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.
ఇక భాగ్య శ్రీ బోర్స్ కూడా తెలుగు యువత మనసులు గెలిచింది. రీసెంట్ గా రాం తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో మెప్పించింది అమ్మడు. కెరీర్ లో ఒక్క సాలిడ్ హిట్ పడితే మాత్రం భాగ్య శ్రీకి తిరుగు ఉండదు. అందుకే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలనే టార్గెట్ చేసుకుందని తెలుస్తుంది. భాగ్య శ్రీ ఖాతాలో ఒక భారీ హిట్ పడితే మాత్రం సౌత్ లో ఆమె టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచు.
రుక్మిణి వసంత్, భాగ్య శ్రీ బోర్స్ ఎవరి బలాలు వారివి. కాకపోతే రుక్మిణి గ్లామర్ కన్నా తన నటనతో ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఐతే భాగ్య శ్రీ నుంచి ఆడియన్స్ గ్లామర్ షో కూడా ఆశిస్తున్నారు. అమ్మడు కూడా అందుకు రెడీ అన్నట్టుగానే ఉంది. తొలి సినిమా మిస్టర్ బచ్చన్ లోనే భాగ్య శ్రీ గ్లామర్ ఎటాక్ ఆడియన్స్ ని ఫిదా చేసింది.
ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని..
సో ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని కోరుతున్నారు. భాగ్య శ్రీ నెక్స్ట్ అఖిల్ తో లెనిన్ సినిమా చేస్తుంది. రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తుండగా ఆ నెక్స్ట్ కూడా స్టార్ సినిమాలు డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
రుక్మిణి ఆల్రెడీ స్టార్స్ తో నటిస్తుంది కాబట్టి భాగ్య శ్రీతో పోలిస్తే కాస్త అడ్వాన్స్ గా ఉంది. ఐతే భాగ్య శ్రీ గ్లామర్ షో మాత్రం ఆడియన్స్ ని తెగ డిస్టర్బ్ చేస్తుంది. అమ్మడి ఖాతలో ఒక్క సూపర్ హిట్ పడినా భాగ్య శ్రీ రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు.