నవంబర్ మోత మోగించేందుకు సిద్ధమా..?

స్టార్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. సాంగ్స్ తో కూడా రికార్డులు సృష్టించే సత్తా వారికి ఉంటుంది.;

Update: 2025-11-02 06:01 GMT

స్టార్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. సాంగ్స్ తో కూడా రికార్డులు సృష్టించే సత్తా వారికి ఉంటుంది. స్టార్ సాంగ్ ఇలా రిలీజైతే చాలు అలా వైరల్ అవుతుంది. రీల్స్ తో సోషల్ మీడియా అంతా కూడా పిచ్చెక్కించేస్తారు. ఈమధ్యనే రిలీజైన మెగాస్టార్ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ అయితే సూపర్ హిట్ అయిపోయింది. అందుకే నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న సినిమాల సాంగ్స్ ని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం రిలీజ్ చేయబోతున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్..

ముందుగా అక్టోబర్ 23న రిలీజ్ చేయాలని అనుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజా సాబ్ సినిమాకు మ్యూజిక్ మరో హైలెట్ అయ్యేలా ఉండగా అందుకు తగినట్టుగానే థమన్ ట్రీట్ ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాతో పాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి కూడా ఫస్ట్ సాంగ్ నవంబర్ 8న ఏ.ఆర్.రెహమాన్ లైవ్ కన్సర్ట్ లో రిలీజ్ చేస్తున్నారు. రెహమాన్ ఆఫ్టర్ లాన్ టైం తెలుగులో చేస్తున్న సినిమా కాగా. చరణ్ తో తొలిసారి కలిసి చేస్తున్న ఆల్బం అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా మ్యూజిక్ లవర్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెహమాన్ కంపోజింగ్ అంటే సాంగ్స్ గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదంతే అనేలా తన బ్రాండ్ కొనసాగిస్తున్నాడు.

థమన్ మ్యూజిక్ స్పీకర్స్ బ్లాస్ట్..

ఇక ఈ సినిమాతో పాటు డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేసిన అఖండ 2 సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ ని త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు థమన్ మ్యూజిక్ అంటే స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఐతే అఖండ 2 సాంగ్స్ విషయంలో కూడా థమన్ స్పెషల్ ఫోకస్ చేశాడని తెలుస్తుంది. డిసెంబర్ లో అఖండ 2 రిలీజ్ ఉండగా ఈ మంత్ లో సినిమాకు సంబందించిన సాంగ్స్ ఇంకా ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ కానున్నాయి.

వీటితో పాటుగా దళపతి విజయ్ జన నాయగన్ సినిమా నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజింగ్ లో ఈ సాంగ్ వస్తుంది. అసలైతే ఇప్పటికే జన నాయగన్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సింది కానీ విజయ్ మీటింగ్ లో ప్రజల ప్రాణాలు కోల్పోవడం వల్ల సినిమా ప్రమోషన్స్ టైం తీసుకున్నారు. జన నాయగన్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను తెలుగులో కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

నవంబర్ నెల మొత్తం స్టార్ సినిమాల సాంగ్స్ తో మోత మిగించేందుకు వస్తున్నారు. ఈ మంత్ లో స్టార్ సినిమాలు రిలీజ్ లు లేవు.. కానీ స్టార్ సినిమాల సాంగ్స్ తో కిక్ ఇవ్వనున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్స్ తోనే స్టార్ సినిమాలను ట్రెండింగ్ లో ఉంచాలని చూస్తున్నారు.

Tags:    

Similar News