'పెద్ది' డైలమా: పర్సంటేజీ షేర్ చేస్తేనే రిలీజ్?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ''థియేటర్ల అద్దె విధానం వర్సెస్ పర్సంటేజీ షేరింగ్'' అనే అంశంపై పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది.

Update: 2026-05-14 17:48 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం ''థియేటర్ల అద్దె విధానం వర్సెస్ పర్సంటేజీ షేరింగ్'' అనే అంశంపై పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. పరిశ్రమ బాగు కోసమే తాము ఈ చర్చను లేవనెత్తామని ఒక వర్గం అంటుంటే, ఇది కేవలం లెస్సీల (లీజుకు తీసుకున్న వారు) ప్రయోజనాల కోసమేనని మరో వర్గం వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు ఎంతటి తీవ్ర రూపం దాల్చిందంటే, ఏషియన్ సునీల్ నారంగ్-శిరీష్ రెడ్డి నేతృత్వంలోని ఎగ్జిబిటర్ల వర్గం, మైత్రి రవిశంకర్-నాగవంశీ నేతృత్వంలోని నిర్మాతల‌ వర్గం ఒక‌రితో ఒక‌రు వాదోప‌వాదాలు సాగిస్తున్నారు..

పర్సంటేజీ విధానానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ప్రస్తుతం తమ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం పర్సంటేజీ విధానానికి అంగీకరిస్తేనే ఈ సినిమాను థియేటర్లలో ఆడనిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీనిపై మైత్రి నిర్మాతలు ససేమిరా అనడంతో `పెద్ది` రిలీజ్ విషయంలో డైలమా నెలకొంది. ఈ ప్రతిష్టంభన వల్ల సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ నైజాం ఎగ్జిబిటర్లు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

పర్సంటేజీ విధానం విషయంలో మొట్టమొదటగా ఎవరు అడుగు ముందుకు వేశారనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సూర్య నటించిన `వీరభద్రుడు` చిత్రాన్ని పర్సంటేజీ షేరింగ్ విధానంలోనే విడుదల చేస్తున్నామని ప్రకటించిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత్రి సుప్రియ కూడా ఆ విధానానికి ఓకే చెప్పడం విశేషం. ఇలా ఒక్కొక్కరుగా పర్సంటేజీ వైపు మొగ్గు చూపుతుండటం అద్దె విధానాన్ని నమ్ముకున్న నిర్మాతలకు ఇబ్బందిగా మారింది.

నిర్మాతల వాదన ప్రకారం.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలను వదిలేసి, ఇకపై కొత్తగా ప్రారంభించే సినిమాల విషయంలో ఈ పర్సంటేజీ విధానం గురించి ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ``ఈ మాటలు మేము పోయిన జన్మలో కూడా విన్నట్టు ఉంది.. ఇంకెన్నాళ్లు ఇలా సాగదీస్తారు?`` అంటూ ఎగ్జిబిటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మార్పు రావాలనేది వారి ప్రధాన డిమాండ్.

మొత్తానికి, 'పెద్ది' సినిమా విడుదల ఈ వివాదానికి ఒక క్లైమాక్స్‌లా మారేలా ఉంది. పరిశ్రమలోని పెద్దలు రంగంలోకి దిగి ఈ అద్దె వర్సెస్ పర్సంటేజీ సమస్యను పరిష్కరించకపోతే మునుముందు రోజుల్లో మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పంతాలకు పోయి పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టకుండా.. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకాలని సామాన్య సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ''థియేటర్ల అద్దె విధానం వర్సెస్ పర్సంటేజీ షేరింగ్'' అనే అంశంపై పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. పరిశ్రమ బాగు కోసమే తాము ఈ చర్చను లేవనెత్తామని ఒక వర్గం అంటుంటే, ఇది కేవలం లెస్సీల (లీజుకు తీసుకున్న వారు) ప్రయోజనాల కోసమేనని మరో వర్గం వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు ఎంతటి తీవ్ర రూపం దాల్చిందంటే, ఏషియన్ సునీల్ నారంగ్-శిరీష్ రెడ్డి నేతృత్వంలోని ఎగ్జిబిటర్ల వర్గం, మైత్రి రవిశంకర్-నాగవంశీ నేతృత్వంలోని నిర్మాతల‌ వర్గం ఒక‌రితో ఒక‌రు వాదోప‌వాదాలు సాగిస్తున్నారు..

పర్సంటేజీ విధానానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ప్రస్తుతం తమ ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం పర్సంటేజీ విధానానికి అంగీకరిస్తేనే ఈ సినిమాను థియేటర్లలో ఆడనిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీనిపై మైత్రి నిర్మాతలు ససేమిరా అనడంతో `పెద్ది` రిలీజ్ విషయంలో డైలమా నెలకొంది. ఈ ప్రతిష్టంభన వల్ల సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ నైజాం ఎగ్జిబిటర్లు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

పర్సంటేజీ విధానం విషయంలో మొట్టమొదటగా ఎవరు అడుగు ముందుకు వేశారనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సూర్య నటించిన `వీరభద్రుడు` చిత్రాన్ని పర్సంటేజీ షేరింగ్ విధానంలోనే విడుదల చేస్తున్నామని ప్రకటించిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత్రి సుప్రియ కూడా ఆ విధానానికి ఓకే చెప్పడం విశేషం. ఇలా ఒక్కొక్కరుగా పర్సంటేజీ వైపు మొగ్గు చూపుతుండటం అద్దె విధానాన్ని నమ్ముకున్న నిర్మాతలకు ఇబ్బందిగా మారింది.

నిర్మాతల వాదన ప్రకారం.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలను వదిలేసి, ఇకపై కొత్తగా ప్రారంభించే సినిమాల విషయంలో ఈ పర్సంటేజీ విధానం గురించి ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ''ఈ మాటలు మేము పోయిన జన్మలో కూడా విన్నట్టు ఉంది.. ఇంకెన్నాళ్లు ఇలా సాగదీస్తారు?'' అంటూ ఎగ్జిబిటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మార్పు రావాలనేది వారి ప్రధాన డిమాండ్.

మొత్తానికి, `పెద్ది` సినిమా విడుదల ఈ వివాదానికి ఒక క్లైమాక్స్‌లా మారేలా ఉంది. పరిశ్రమలోని పెద్దలు రంగంలోకి దిగి ఈ అద్దె వర్సెస్ పర్సంటేజీ సమస్యను పరిష్కరించకపోతే మునుముందు రోజుల్లో మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పంతాలకు పోయి పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టకుండా.. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకాలని సామాన్య సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News