హిట్స్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు!
ఒక్క హిట్ కెరీర్‌ను ఆకాశానికి తీసుకెళ్తే.. వరుస ప్లాప్‌లు రేసులో వెనకబడిపోయేలా చేస్తాయి. ప్రస్తుతం తెలుగు తెరపై ఉనికిని కాపాడుకోవడానికి, అవకాశాలను మరింత పెంచుకోవడానికి కొందరు కథానాయికలు రాబోయే చిత్రాలపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.
చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ అనేది అత్యంత కీలకం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఒక్క పరాజయం పడినా? అవకాశాలు వేగంగా తగ్గే ప్రమాదం ఉంటుంది. ఒక్క హిట్ కెరీర్‌ను ఆకాశానికి తీసుకెళ్తే.. వరుస ప్లాప్‌లు రేసులో వెనకబడిపోయేలా చేస్తాయి. ప్రస్తుతం తెలుగు తెరపై ఉనికిని కాపాడుకోవడానికి, అవకాశాలను మరింత పెంచుకోవడానికి కొందరు కథానాయికలు రాబోయే చిత్రాలపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.
`బేబీ` చిత్రంతో ఒక్కసారిగా యూత్‌లో సంచలనం సృష్టించిన వైష్ణవి చైతన్య అటుపై సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. `జాక్` సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అమ్మడి కెరీర్ కొంత నెమ్మదించింది. ఈ నేపథ్యంలో సొగసరి ఆశలన్నింటినీ `ఎపిక్` చిత్రంపైనే పెట్టుకుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ హిట్టయితేనే వైష్ణవికి టాలీవుడ్‌లో మళ్లీ పూర్వవైభవం.. కొత్త ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
`అల్లూరి` సినిమా వైఫల్యంతో ఆశించిన గుర్తింపు సాధించలేకపోయిన మోడల్, నటి కయాదు లోహర్ నిరీక్షణలో ఉంది. ఈ భామ సెప్టెంబర్ 24న విడుదల కానున్న `ది పారడైజ్` చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తేనే ? టాలీవుడ్‌లో కయాదు జాతకం మారి, మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
`కేజీఎఫ్` ఫ్రాంచైజీతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత వచ్చిన `హిట్ 3` ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో రేసులో వెనకబడ్డారు. ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ వెంకటేష్ సరసన నటిస్తున్న `ఆదర్శ కుటుంబం` చిత్రంపైనే దృష్టిని కేంద్రీకరించింది. సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు పెరగాలన్నా? టాలీవుడ్‌లో మార్కెట్ నిలబడాలన్నా? ఈ చిత్రం హిట్ అవ్వడం శ్రీనిధికి అత్యంత కీలకం.
మలయాళ చిత్రసీమ నుంచి వచ్చి నటనతో ఆకట్టుకుంటున్న అనశ్వర రాజన్ ఇప్పటివరకు మంచి గుర్తింపు తెచ్చుకున్నా కమర్షియల్ బిగ్ హిట్ కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న `కాకా` చిత్రంతో పాటు `ఇట్లు అర్జున` సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక `లెనిన్` చిత్రంతో యావరేజ్ విజయాన్ని అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకి ఆ ఫలితం సంతృప్తినివ్వలేదు. కెరీర్‌లో బిగ్ బ్రేక్ కోసం అమ్మడు కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ పైనే ఆశలు పెట్టుకుంది.
వీరితో పాటు నయాన్ సారిక, ప్రీతి ముకుందన్ వంటి కొత్త కథానాయికలు కూడా టాలీవుడ్‌లో గ్రాండ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత ప్రతిభ ఉన్నా? బాక్సాఫీస్ సక్సెసే హీరోయిన్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి రాబోయే మూడు నెలల్లో విడుదల కానున్న ఈసినిమాలు భామల కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి. ఇంకా సీనియర్ భామల విషయానికి వస్తే తమన్నా ఎన్ని సినిమాలు చేసినా? అమ్మడి దాహం ఎంతకూ తీరడం లేదు. ఇంకా టాలీవుడ్ లో ఏదో సాధించాలి అన్న కసి అమ్మడిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ తో పాటు తెలుగులో ఎలాంటి అవకాశాలు వచ్చినా నో చెప్పకుండా పని చేస్తుంది.