మూవీ ప్ర‌మోష‌న్‌..చించేస్తున్న డైరెక్ట‌ర్స్‌!

సినిమా మేకింగ్ ఒకెత్తు.. దాన్ని ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు అంతే ఫోర్స్‌గా తీసుకెళ్ల‌డం ఒకెత్తు. ఇది ఇప్పుడు ప్ర‌తి టీమ్‌కు కీల‌కంగా మారింది.;

Update: 2026-01-08 09:45 GMT

ఎంత పాన్ ఇండియా సినిమాల ప్ర‌భావం పెరిగినా.. బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టే స్టార్స్ ఉన్నా సినిమా ఆడాలంటే.. ప్రేక్ష‌కులకు చేరువ కావాలంటే మూవీ ప్ర‌మోష‌న్స్ ఖ‌చ్చ‌తంగా చేయాలంసిందే. ప్రేక్ష‌కుల్ని త‌మ సినిమా వైపు తిప్పుకోవ‌డానికి, ప్రేక్ష‌కుల్లో అటెన్షన్ క్రియేట్ చేయ‌డానికి మూవీ టీమ్ రోడ్డెక్కాల్సిందే.. ప్ర‌మోష‌న్స్ ని హోరెత్తించాల్సిందే. అలా చేయ‌క‌పోతే సినిమా ఆడే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. స్టార్ హీరో, డైరెక్ట‌ర్‌.. పాన్ ఇండియా సినిమా అయినా స‌రే ప్ర‌మోష‌న్స్ మ‌స్ట్‌.

సినిమా మేకింగ్ ఒకెత్తు.. దాన్ని ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు అంతే ఫోర్స్‌గా తీసుకెళ్ల‌డం ఒకెత్తు. ఇది ఇప్పుడు ప్ర‌తి టీమ్‌కు కీల‌కంగా మారింది. దీని కోసం ఏం చేయాలో అది చేయ‌డానికి నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, ఇందులో న‌టించిన న‌టీన‌టులు వెన‌కాడ‌టం లేదు. ఇక సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఆర్టిస్ట్‌ల‌తో పాటు ద‌ర్శ‌కులు కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. గ‌తంలో ఆ బాధ్య‌త‌ని నిర్మాత‌లు, హీరో హీరోయిన్‌లు, ఆర్టిస్ట్‌లు మాత్ర‌మే చూసుకునే వారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

ఒక సినిమా మొద‌లైందంటే దాన్ని ప్రేక్ష‌కుల్లోకి ఎలా తీసుకెళ్లాలి?..ప్ర‌మోష‌న్స్ ఎలా ఉండాలి? దానికి ద‌ర్శ‌కుడి పాత్ర ఏంటి? అనే లెక్క‌లు ప్రోడ్యూస‌ర్స్ వేస్తున్నారు. దానికి సిద్ధ‌ప‌డి ద‌ర్శ‌కులు కూడా త‌మ వంత బాధ్య‌త‌ని నిర్వ‌ర్తిస్తూ సినిమా ప్ర‌మోష‌న్స్‌ని హోరెత్తిస్తున్నారు. రాజ‌మౌళి మొద‌లు పెట్టిన ఈ సంప్ర‌దాయాన్ని మిగ‌తా ద‌ర్శ‌కులంతా పాటిస్తూ త‌మ సినిమాల ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటూ ప్ర‌చారాన్ని పీక్స్‌కు తీసుకెళుతున్నారు. అంతే కాకుండా హీరోలు మాత్ర‌మే చేయాల్సిన ప‌నిని తాము కూడా చేస్తామంటూ స్టేజ్ ఎక్కేస్తున్నారు.

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో హీరోయిన్‌ల‌తో క‌లిసి హీరోల్లా స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొట్టేస్తున్నారు. ఈ విష‌యంలో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ముందుంటూ నెట్టింట వైర‌ల్‌ అవుతున్న విష‌యం తెలిసిందే. `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాకు ఇదే త‌ర‌హాలో ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించి ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన ఆయ‌న తాజాగా మెగాస్టార్‌తో చేస్తున్న `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`కు కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ ప్ర‌మోష‌న్స్‌ని హోరెత్తిస్తున్నాడు.

రీసెంట్‌గా జ‌రిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో `హుక్ స్టెప్` సాంగ్ కు సీట్లోంచి లేచి వెంకీతో క‌లిసి చిరు ముందే స్టెప్పులేస్తూ ఆడిటోరియాన్ని హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ సినిమాని ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. ఇదే పంథాని మ‌రో డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల కూడా ఫాలో అవుతుండ‌టం ప‌లువురిని షాక్‌కు గురి చేస్తోంది. స్వ‌త‌హాగా రిజ‌ర్వ్డ్ అయిన కిషోర్ తిరుమ‌ల ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` పేరుతో ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ చేస్తున్నాడు.

ర‌వితేజ త‌న పంథాకు పూర్తి భిన్నంగా చేసిన ఈ మూవీలో డింపుల్ హ‌యాతీ, అషిక రంగ‌నాథ్ హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేసింది. దాన్నిమ‌రింత‌గా పెంచే క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్న డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల హీరోయిన్స్ డింపుల్ హ‌యాతీ, అషిక రంగ‌నాథ్‌ల‌తో క‌లిసి ఈ మూవీలోని `వామ్మో వాయ్యే వ‌ల్లెంక‌లో.. ` అంటూ సాగే పాట‌కు స్టేజ్‌పై మాస్ రాజా త‌ర‌హాలో స్టెప్పులు వేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతూ `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` మూవీ ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఇలా ద‌ర్శ‌కులు కూడా రంగంలోకి దిగ‌డంతో సినిమా ప్ర‌మోష‌న్స్ కొత్త పుంత‌లు తొక్కుతోంది.





Tags:    

Similar News