గేర్ మార్చి స్పీడ్ పెంచుతున్నారా?
సినిమా రిలీజ్ అన్నది పూర్తిగా దర్శకుడి చేతుల్లో పనే. టాలీవుడ్ పరంగా చూస్తే? అగ్ర సినిమాల రిలీజ్ విషయంలో దర్శకుడికి నిర్మాత వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది.;
సినిమా రిలీజ్ అన్నది పూర్తిగా దర్శకుడి చేతుల్లో పనే. టాలీవుడ్ పరంగా చూస్తే? అగ్ర సినిమాల రిలీజ్ విషయంలో దర్శకుడికి నిర్మాత వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. హీరోలతోనూ పెద్దగా సమస్యలేవి ఉండవు. కాల్సీట్లు పక్కాగా కేటాయిస్తారు. దర్శకుడికి చెప్పిన టైమ్ కి సెట్ లో ఉంటాడు హీరో. క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నవి పెద్దగా రావు. వచ్చినా? అక్కడిక్కడ పరిష్కారయ్యే సమస్యలే. కానీ సినిమా మొదలు పెట్టిన తర్వాత రిలీజ్ చేయడానికి మాత్రం సంవత్సరాలు సమయం పడుతుంది.
అందుకు కారణం మాత్రం దర్శకులు మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెట్స్ కి వెళ్లిన తర్వాత మేకింగ్ పరంగా డిలే చేస్తారు? అన్నది వాస్తవం. సన్నివేశాల పర్పెక్షన్ కోసం రకరకాల టేక్ లు తీసు కోవడం...రీషూట్లు లాంటివి తప్పవు. ఒక షెడ్యూల్ పూర్తి చేసి తిరిగి కొత్త షెడ్యూల్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇక్కడే సమయం వృద్ధాగా పోతుంది. షెడ్యూల్ కి షెడ్యూల్ కి మధ్య లాంగ్ గ్యాప్ ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో ఆన్ సెట్స్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు గేర్ మార్చి స్పీడ్ పెంచుతున్నట్లు సమా చారం. షూటింగ్ డేస్ తగ్గించి ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాలనే స్ట్రాటజీతో ముందుకెళ్తన్నారట. మేకింగ్ లోనూ హాలీవుడ్ స్టైల్ కనిపించాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారుట. రెండేళ్ల పైబడి సినిమాలు తీసే దర్శకులు ఇకపై అంత సమయం తీసుకోకుండా షూటింగ్ డేస్ వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం సెట్స్ లో ఉన్న ఎస్ ఎస్ ఎంబీ 29, పౌజీ, పెద్ది లాంటి చిత్రాల విషయంలో షూటింగ్ డేస్ తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. వెస్ట్రన్ డైరెక్టర్లు ఇదే స్ట్రాటజీతో సినిమాలు చేస్తారు. చిత్రీకరణ వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షణ్ కి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. సినిమాలు ఇలా చేయగల్గితే స్టార్ హీరోలకు రిలీజ్ ల విషయంలో గ్యాప్ తగ్గుతుంది. మధ్యలో కొత్త సినిమా ప్లాన్ చేసుకొవచ్చు. ఒక సినిమా ఆలస్య మైనా మరో సినిమా రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మేకర్స్ అంతా పర్పెక్ట్ గా ఈ స్ట్రాటజీని అమలు చేయగల్గితే హీరోలు ఏడాది ఒక సినిమా రిలీజ్ చేయగలరు.