• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీల: చీరలో అప్సరస...

శ్రీలీల: చీరలో అప్సరస మెరుపులు

| ‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-12-03 05:47 GMT

‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం డాన్సింగ్ క్వీన్ అనే ఇమేజ్ తో దూసుకుపోతోంది. కమర్షియల్ హీరోయిన్ గా ఓ వైపు స్టార్ హీరోలతో జతకడుతూ మరో వైపు పాన్ ఇండియా స్టార్స్ తో కూడా ఆడిపాడే అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.


‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆ బ్యూటీ ‘ధమాకా’లో రవితేజకి జోడీగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘గుంటూరు కారం’లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆడిపాడింది. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ తో డాన్సింగ్ క్వీన్ అనే ఇమేజ్ తెచ్చేసుకుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ ‘పుష్ప 2’లోని కిస్సిక్ సాంగ్ తో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.


ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ ని తెరపై చూడటానికి ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే కచ్చితంగా శ్రీలీల క్రేజ్ పెరిగిపోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. ఈ నెలలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇదిలా ఉంటే శ్రీలీల ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఆమె వైట్ కలర్ చీరలో ఉన్న స్టైలిష్ గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ తెల్లచీరలో శ్రీలీల దివి నుంచి దిగివచ్చిన అప్సరసల ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అని ప్రశంసిస్తున్నారు.

Tags:    
  • Sreeleela 
  • Actress 
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Kissiksong 
  • Pictalk 
  • Trendingclicks 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS