పిక్‌టాక్‌ : పొట్టి గౌనులో అందాల రాయ్‌

టాలీవుడ్‌లో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అడుగు పెట్టిన ముద్దుగుమ్మ లక్ష్మి రాయ్‌. ఇప్పుడు ఈమె తన పేరును రాయ్‌ లక్ష్మిగా మార్చుకున్న విషయం తెల్సిందే.;

Update: 2025-08-25 10:30 GMT

టాలీవుడ్‌లో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అడుగు పెట్టిన ముద్దుగుమ్మ లక్ష్మి రాయ్‌. ఇప్పుడు ఈమె తన పేరును రాయ్‌ లక్ష్మిగా మార్చుకున్న విషయం తెల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి అందాల ఆరబోత పాత్రలను చేయడంతో పాటు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ వచ్చింది. సాధారణంగా స్టార్‌ హీరోయిన్స్ మాత్రమే దశాబ్ద కాలం కంటే ఎక్కువగా ఇండస్ట్రీలో ఉంటారు. అయితే రాయ్ లక్ష్మి మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేయలేదు. అయినా కూడా ఆమె ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. రెండు దశాబ్దాలు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగిన అరుదైన హీరోయిన్స్‌ జాబితాలో రాయ్ లక్ష్మి ఉంటుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఎక్కువ సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలోనూ ఈమె అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంది.


జూలీ తో బాలీవుడ్‌లో రాయ్‌ లక్ష్మి..

గత ఏడాది డీఎన్‌ఏ సినిమాతో, అంతకు ముందు ఏడాది భోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒక్క సినిమా చొప్పున చేస్తున్న రాయ్‌ లక్ష్మి ఒకప్పుడు ఏడాదిలో ఐదు ఆరు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లోనూ ఈమె సందడి చేసింది. స్కిన్‌ షో చేయడం మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేయడం ద్వారా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. అంతే కాకుండా ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్‌ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అందాల ఫోటోల కారణంగా నెట్టింట ఈమె మిలియన్‌ల కొద్ది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. హిందీలో ఈమె చేసిన జూలీ 2 సినిమా నటిగా రాయ్‌ లక్ష్మి స్థాయిని మరింతగా పెంచిందని కొందరు అంటూ ఉంటారు.


అందాల ఫోటో షూట్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందాల ఫోటో షూట్స్‌ను, కవర్‌ పేజీలను షేర్‌ చేస్తూ ఉండే రాయ్‌ లక్ష్మి అప్పుడప్పుడు తన రెగ్యులర్‌ రొటీన్‌ ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో ఈ అమ్మడు పర్యటిస్తున్న ఫోటోలు షేర్‌ చేసింది. అందులో చాలా అందంగా కనిపించడం తో పాటు ఆకట్టుకునే విధంగా ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు. పొట్టి డ్రెస్‌లో ఈ అమ్మడు ఆకట్టుకుంది. పొట్టి డ్రెస్‌లో రాయ్‌ లక్ష్మి అందాల షో ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నా కొద్ది రాయ్‌ లక్ష్మి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


పాన్‌ ఇండియా సినిమాల్లో మోస్ట్‌ వాంటెడ్‌

తెలుగులో కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అందంతో కొనసాగుతున్న రాయ్‌ లక్ష్మి టాలీవుడ్‌లో వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి అనే మూవీలో కనిపించింది. తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేయడం ద్వారా పాన్ ఇండియన్‌ భాషలు అన్నింటిలోనూ సినిమాలు చేసిన ఘనత రాయ్‌ లక్ష్మికి దక్కింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసి ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వయసు పెరిగినా కొద్ది అందం సైతం పెరుగుతున్నట్లు చాలా అందంగా కనిపిస్తున్న రాయ్‌ లక్ష్మి మరో పదేళ్ల పాటు ఇదే అందంతో అలరిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News