డైరెక్ష‌న్ చేస్తానంటే ప‌క్క‌కెళ్లి ఆడుకోమ‌న్నారా?

2024లో ఇండియ‌న్ సూప‌ర్ హీరో సూప‌ర్ ప‌వ‌ర్స్ నేప‌థ్యంలో రూపొందిన పాన్ ఇండియా మూవీలో కీల‌క పాత్ర పోషించి తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆ న‌టి ద‌ర్శ‌కురాలిగా అరంగేట్రం కోసం ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ని రాసుకుంది.;

Update: 2026-01-08 03:30 GMT

`బాహుబ‌లి` త‌రువాత ఇండియ‌న్ సినిమా మార్కెట్‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి. బ‌డ్జెట్‌, సినిమాల మార్కెట్ స్పాన్ కూడా భారీ స్థాయిలో పెర‌గ‌డం.. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాది సినిమాల మార్కెట్ రికార్డు స్థాయిలో పెర‌గ‌డంతో సినిమాల నిర్మాణం ఊపందుకుంది. పాన్ ఇండియా సినిమాలే కాకుండా మినిమ‌మ్ బ‌డ్జెట్ రేంజ్‌లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ప్రొడ‌క్ష‌న్ భారీ స్థాయిలో పెరిగింది. దీంతో కొత్త కొత్త న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశిస్తున్నారు.

ఇందులో కొంత మంది భారీ విజ‌యాలు సాధిస్తుంటే మ‌రి కొంత మంది చేతులు కాల్చుకుంటున్నారు. భారీ చిత్రాల‌కు మించి చిన్న సినిమాలు సూప‌ర్ హిట్ అవుతుండ‌టం, ఓటీటీ మార్కెట్ కూడా ఉండ‌టంతో చాలా మంది స‌రికొత్త క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. పాపుల‌ర్ స్టార్స్ కూడా మెగా ఫోన్ ప‌ట్టి కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇప్ప‌టికే కొంత మంది యంగ్ స్ట‌ర్స్, క‌మెడియ‌న్స్ ద‌ర్శ‌కులుగా మారుతూ స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటున్న వేళ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ప్ర‌స్తుతం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తున్న ఓ క్రేజీ న‌టి కూడా డైరెక్ట‌ర్‌గా రంగంలోకి దిగాల‌ని ప్లాన్ చేసుకుంది.

2024లో ఇండియ‌న్ సూప‌ర్ హీరో సూప‌ర్ ప‌వ‌ర్స్ నేప‌థ్యంలో రూపొందిన పాన్ ఇండియా మూవీలో కీల‌క పాత్ర పోషించి తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆ న‌టి ద‌ర్శ‌కురాలిగా అరంగేట్రం కోసం ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ని రాసుకుంది. దాన్ని తెర‌పైకి తీసుకురావాలంటే మంచి అభిరుచి గ‌ల ప్రొడ‌క్ష‌న్ హౌస్ కావాల‌ని ప్రొడ్యూస్ చేసే సంస్థ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిందట‌. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ని కలిసి క‌థ వినిపించి దీనికి డైరెక్ట‌ర్, హీరోయిన్ నేనే అని చెప్పింద‌ట‌.

అది విన్న స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ చిన్న‌గా న‌వ్వి ప‌క్క‌కెళ్లి ఆడుకోమ‌న్నంత ప‌ని చేశాడ‌ట‌. దీంతో ఈగో హ‌ర్ట్ అయిన న‌టి స‌ద‌రు ప్రొడ్యూస‌ర్‌కు చెప్పిన క‌థ‌ని తీసుకుని తానే నిర్మాత‌గా సినిమా మొద‌లు పెట్టి ద‌ర్శ‌కురాలిగా అరంగేట్రం చేస్తోంది. ఇటీవ‌లే షూటింగ్‌ని కూడా పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ అవుతోంది. కోలీవుడ్‌లో శింబు న‌టించిన మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఆ త‌రువాత‌ ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌ల‌కు త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. అలాంటి న‌టి ఈగోని స్టార్ ప్రొడ్యూస‌ర్ హ‌ర్ట్ చేయ‌డంతో రాకెట్ వేగంతో డైరెక్ట‌ర్‌గా, నిర్మాత‌గా, న‌టిగా సినిమాని పూర్తి చేసి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతోంది.

త‌ను చేసిన సినిమా స‌క్సెస్ అయితే ద‌ర్శ‌కురాలిగానే కాకుండా నిర్మాత‌గానూ హిట్ట‌యిన‌ట్టే. అదే జ‌రిగితే త‌న‌ని,త‌న ఈగోని హ‌ర్ట్ చేసిన స్టార్ ప్రొడ్యూస‌ర్ ప‌రిస్థితేంటీ? త‌ను ఎలా రియాక్ట్ అవుతాడు?.. అనే చ‌ర్చ ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఈ ఈగో రైడ్‌లో హీరోయిన్ ట‌ర్న్‌డ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ విజ‌యం సాధిస్తుందా? డైరెక్ట‌ర్‌గా ఫ‌స్ట్ మూవీతో సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంటుందా? అన్న‌ది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News