పచ్చని పొలాల మధ్య సందడి చేస్తున్న అనుపమ.. ఫోటోలు వైరల్!
అనుపమ పరమేశ్వరన్.. ఒకప్పుడు చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ చాలా పద్ధతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.;
అనుపమ పరమేశ్వరన్.. ఒకప్పుడు చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ చాలా పద్ధతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మలయాళీ ముద్దుగుమ్మకు తెలుగులో భారీగానే ఆఫర్లు వచ్చాయి. దీంతో అమ్మడు రేంజ్ స్టార్ స్టేటస్ కి పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు.. కానీ అనూహ్యంగా అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. మళ్లీ రెట్టింపు వేగంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇటీవల పరదా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి 'కిష్కింధపురి' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 'బైసన్' అనే మరో సినిమాలో నటిస్తోంది అనుపమ. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేస్తూ అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది.
అలాగే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా రెడ్ చుడీదార్ ధరించిన ఈమె.. పచ్చని పొలాల మధ్య పరవశించిపోతూ చూపరులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసును ఉత్సాహపరిచేలా ఫోటోలు షేర్ చేసింది అనుపమ. నిజానికి ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫోటోలు షేర్ చేసి చాలా రోజులు అయింది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అనుపమ కెరియర్ విషయానికి వస్తే.. 'ప్రేమమ్' సినిమాలో చిన్న పాత్ర పోషించిన అనుపమ.. ఈ మలయాళం చిత్రంతోనే తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో నితిన్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శతమానం భవతి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది అనుపమ. మధ్యలో రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చిందని ఈమెనే రిజెక్ట్ చేసిందని కొంతమంది లేనిపోని రూమర్స్ క్రియేట్ చేశారు. వాటి వల్ల ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుపమ మళ్లీ అన్నింటిని చక్కబెట్టుకుని వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. అలా సౌత్ లో దాదాపు చాలామంది హీరోలతో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇప్పుడు కం బ్యాక్ లో వరుస చిత్రాలతోనే కాదు ఆ చిత్రాలతో సక్సెస్ కూడా అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. మరి ఈ అమ్మడి కెరీర్ కు మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించే సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి