వీడియో: జాన్వీ హొయలు ఆ రేంజులో..
బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం నటనా రంగంలోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తోంది.;
బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం నటనా రంగంలోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అటు బాలీవుడ్‌లో తిరుగులేని ఫ్యాషనిస్టాగా గుర్తింపు పొంది.. ప్రతి ఈవెంట్‌లోనూ తన ప్రత్యేకమైన వస్త్రధారణతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీ - సినిమాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా జాన్వీ ప్రముఖ పంజాబీ గాయకుడు ఆలపించిన గీతానికి అందమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఇమ్మిటేట్ చేస్తూ యూత్ ని టీజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న జాన్వీకి, ఎన్టీఆర్ సరసన నటించిన `దేవర` చిత్రం భారీ విజయాన్ని అందించడమే కాకుండా.. ఇక్కడ బలమైన పునాదిని వేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన `పెద్ది` సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోలతో పనిచేయడం జాన్వీ మార్కెట్ వాల్యూను మరింత పెంచుతోంది.
`పెద్ది` చిత్ర బృందం ఇప్పటివరకు జాన్వీకి సంబంధించిన విజువల్స్ ని కానీ.. తన పాత్ర స్వభావాన్ని వెల్లడించకుండా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తోంది. అయితే సుకుమార్ రైటింగ్స్ వంటి ప్రతిష్టాత్మక బృందాలు రూపొందిస్తున్న చిత్రాల్లో నాయిక పాత్రలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. జాన్వీ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. నటిగా తన అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి జాన్వీకి ఇది సదవకాశం.
జాన్వీ తన తల్లి శ్రీదేవి నటించిన `జగదేకవీరుడు అతిలోకసుందరి` వంటి క్లాసిక్ చిత్రాల సీక్వెల్స్‌లో నటించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. `పెద్ది` తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వైజయంతి అధినేత అశ్వినీదత్ నుండి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇటువంటి వారసత్వ బాధ్యతాయుతమైన చిత్రాలు జాన్వీ కెరీర్‌కు మరో పెద్ద మలుపునిస్తాయనడంలో సందేహం లేదు.
కెరీర్ ప్రారంభంలోనే ఉత్తరాది- దక్షిణాది వంటి విభిన్న ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంచుకోవడం వల్ల జాన్వీ పలు రకాల పని సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం పొందుతోంది. ఇలాంటి పాన్-ఇండియా ప్రయత్నాలు జాన్వీని ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నాయి. మొత్తానికి శ్రీదేవి నటవారసురాలిగా జాన్వీ ఎంచుకుంటున్న ఈ భారీ చిత్రాలు తనను కేవలం ఒక బాలీవుడ్ నటిగానే కాకుండా.. దక్షిణాదిలో కూడా తిరుగులేని స్టార్‌గా నిలబెట్టే అవకాశం ఉంది.