సంక్రాంతి టు సమ్మర్.. ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఛేంజ్!

దీంతో పొంగల్ సీజన్ కే తమ సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తుంటారు. అందుకు గాను ముందు నుంచే కర్చీఫులు వేస్తుంటారు.;

Update: 2025-09-15 10:33 GMT

టాలీవుడ్ లో సంక్రాంతి, సమ్మర్, మిడ్- ఇయర్, దసరా, క్రిస్మస్ వంటి సీజన్లను బెస్ట్ గా ట్రీట్ చేస్తుంటారు మేకర్స్, హీరోలు, అభిమానులు. ముఖ్యంగా సంక్రాంతిదే టాప్ సెలక్షన్. ఎందుకంటే కచ్చితంగా ఆ సమయంలో రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు వసూళ్లను సాధిస్తాయి. మేకర్స్ కు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.

దీంతో పొంగల్ సీజన్ కే తమ సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తుంటారు. అందుకు గాను ముందు నుంచే కర్చీఫులు వేస్తుంటారు. ఆ తర్వాత సమ్మర్ లో అంటే మార్చి, ఏప్రిల్ లో కూడా విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు హాలీడేస్ బాగా కలిసొస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే ఇక తిరుగుండదు.

అదే సమయంలో మిడ్ ఇయర్ పై కొందరు మేకర్స్ ఫోకస్ చేస్తుంటారు. మే- జూన్ నెలల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ గా మారింది. 2026 సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. మరో రెండు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు అందులో ఓ సినిమా.. సమ్మర్ కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆ టైమ్ లో రిలీజ్ కావాల్సిన మరో సినిమా.. మిడ్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలకు సంబంధించిన మేకర్స్.. ఆ విషయాన్ని మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేయనున్నారని వినికిడి.

అయితే 2026 సంక్రాంతికి గాను.. తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి మన శివశంకర వరప్రసాద్ గారు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు విడుదలవుతున్నాయి. యువ కథానాయకుడు శర్వానంద్, మాస్ మహారాజా రవితేజ కూడా అప్పుడే వస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ సినిమాల్లో ఒకటి సమ్మర్ కు పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది. అదే సమయంలో సమ్మర్ లో అంటే మార్చిలో రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ రిలీజ్ డేట్స్ ను ఖరారు చేసుకున్నాయి. వాటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా రానున్నాయి. వాటన్నింటిలో ఒక చిత్రం.. మిడ్ 2026కి వాయిదా పడిందని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Tags:    

Similar News