అట్లీ - బన్నీ మూవీలో టైగర్ ష్రాఫ్.. క్లారిటీ వచ్చేసిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు.;

Update: 2026-01-08 05:29 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA22 xA6 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను భారీ విజువల్ వండర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ వార్త అటు బాలీవుడ్ అభిమానులలో కూడా అంచనాలు పెంచేసింది.

ఏమిటా ఆ వార్త అనే విషయానికొస్తే.. బాలీవుడ్ లో యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో క్రేజీ పాత్రకు ఎంపికైనట్లు ఆ వార్తల సారాంశం. ముఖ్యంగా సౌత్ , నార్త్ స్టార్ లను కలిపి ఒక మల్టీ స్టారర్ లెవెల్ లో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చాయి

అయితే దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది పూర్తిగా అవాస్తవమని సినీ విశ్లేషకులు కూడా కొట్టి పారేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో టైగర్ ష్రాఫ్ భాగం కావడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే గత రెండు రోజులుగా బాలీవుడ్ స్టార్ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు అంటూ వార్తలు రాగా ఒక్క మాటతో చెక్ పెట్టారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇదిలా ఉండగా పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అట్లీ.హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం మేకర్స్ ఏకంగా 400 కోట్లు ఒక్క వీఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా 700 కోట్లు బడ్జెట్ ఈ సినిమాకు దాటే అవకాశం ఉందని.. పైగా ఈ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడడం లేదని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఒక పవర్ఫుల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు రమ్యకృష్ణ కూడా ఇందులో భాగమైంది మొత్తానికైతే భారీ బడ్జెట్లో రాబోతున్న ఈ చిత్రానికి త్వరలోనే టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News