ది ప్యారడైజ్ : శ్రీకాంత్ ఓదెలపై ఒకే ఒక్క కంప్లైంట్..!
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో మూవీ 'ది ప్యారడైజ్'. వీరి కాంబోలో గతంలో వచ్చిన 'దసరా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే ప్యారడైజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో మూవీ 'ది ప్యారడైజ్'. వీరి కాంబోలో గతంలో వచ్చిన 'దసరా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే ప్యారడైజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ను హీరో నాని 'దసరా' సమయంలోనే పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌కి తాను ఇస్తున్న గిఫ్ట్ అంటూ శ్రీకాంత్ ను నాని ఆ సమయంలోనే పరిచయం చేయడం జరిగింది. ఆ మాటలను ఆ సమయంలో కొందరు ట్రోల్ చేసినా, ది ప్యారడైజ్ సినిమా ప్రకటించినప్పటి నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పై నమ్మకం పెంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో రానటువంటి విభిన్నమైన కాన్సెప్ట్‌తో ది ప్యారడైజ్ మూవీని శ్రీకాంత్ రూపొందిస్తున్నట్లుగా అర్థం అవుతుంది. మేకింగ్ విషయంలో శ్రీకాంత్ పై ఎలాంటి కంప్లైంట్ లేదు, కానీ ఆయనపై ఒక కంప్లైంట్ అయితే ఉంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్...
సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడు అయినా సినిమా విడుదల సమయం వరకు ఏదో ఒక మార్పు చేర్పులు చేస్తూ ఉంటాడు. సినిమాను ప్రేక్షకుల ముందుకు మంచిగా పంపాలి, హిట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి దర్శకుడు చివరి నిమిషం వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే సినిమా విడుదలకు వారం రెండు వారాల ముందు ఫస్ట్ కాపీ రెడీ చేసి పెట్టుకుంటారు. చివరి నిమిషం వరకు తుది మెరుగులు దిద్దే దర్శకుల్లో టాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా ఉంటారు. ఇప్పుడు అదే తీరున శ్రీకాంత్ ఓదెల వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ సినిమాలను అద్భుతంగా తీస్తాడు, కానీ సమయం ఎక్కువ తీసుకుంటాడనే కంప్లైంట్ ఉంది. ఆయన ముందు చెప్పిన డేట్‌కి సినిమాను విడుదల చేయలేక పోతున్నాడు. ఇప్పటికీ ప్యారడైజ్ విషయంలో సస్పెన్స్ గానే ఉంది.
నాని, కయాదు లోహర్‌లపై సాంగ్...
ది ప్యారడైజ్ సినిమాను గత నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా మేకింగ్ విషయంలో ఆలస్యం కారణంగా ఈ నెలకు వాయిదా వేయడం జరిగింది. సెప్టెంబర్ 24న సినిమాను విడుదల చేయాల్సి ఉంది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు, నాని ఫ్యాన్స్ ఆ తేదీకి ది ప్యారడైజ్ విడుదల అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం మళ్లీ వాయిదా తప్పదా అనే చర్చ జరుగుతోంది. విడుదలకు కనీసం రెండు వారాల సమయం లేదు, కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేయలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాని, కయాదుపై పాట చిత్రీకరణ చేయాల్సి ఉందట. అంతే కాకుండా కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్ వర్క్ కూడా ఉందని సమాచారం అందుతోంది. ఒకవైపు షూటింగ్ పనులు మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో శ్రీకాంత్ ఓదెల జుట్టు పీక్కుంటున్నట్లు యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు.
ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ సస్పెన్స్..
ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ది ప్యారడైజ్ సినిమాను మళ్లీ వాయిదా వేస్తే అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక దర్శకుడు ఇంకా ఆలస్యం చేయకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆలస్యం జక్కన్న సినిమాల ఆలస్యంను తలపిస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. సినిమా వాయిదా పడటం అంటే కేవలం అభిమానులను నిరుత్సాహ పరచడం మాత్రమే కాదని, నిర్మాతకు భారీగా ఖర్చు పెంచడమే అని దర్శకుడు శ్రీకాంత్ తెలుసుకోవాలని, ముందు ముందు అయినా తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేయాలని కోరుతున్నారు. ఈ ఆలస్యం విషయం తప్ప శ్రీకాంత్ ఓదెల సినిమాల విషయంలో ఎలాంటి విమర్శలు, కంప్లైంట్ ఉండే అవకాశం ఉండదు. కనుక శ్రీకాంత్ ఆ ఒక్క విషయంలో తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.