పోటీని పక్కనపెట్టి.. కొత్త టాలెంట్‌కు అండగా నిలిచిన హీరోయిన్!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య సంబంధాల గురించి మాట్లాడితే ముందుగా వినిపించేది పోటీ అనే మాటే.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య సంబంధాల గురించి మాట్లాడితే ముందుగా వినిపించేది పోటీ అనే మాటే. ఒకే తరహా పాత్రలు, పరిమిత అవకాశాలు, స్టార్ హీరోల సినిమాల్లో చోటు కోసం పోటీ.. ఇలా హీరోయిన్ల మధ్య సహజంగానే ఒక రేస్ ఉంటుందనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. అయితే, ఆ పోటీకి భిన్నంగా మరో ప్రపంచం కూడా ఉంటుందని తాజాగా మాళవిక మోహనన్ చెప్పిన విషయాలు గుర్తు చేస్తున్నాయి. అదే ఒకరినొకరు ప్రోత్సహించుకునే హీరోయిన్ల మధ్య కనిపించని సపోర్ట్ సిస్టమ్.
త్రిష లాంటి సీనియర్ స్టార్ విషయంలో సాధారణంగా ఆమె సినిమాలు, స్టార్‌డమ్, కెరీర్ గ్రాఫ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కొత్త తరం హీరోయిన్లను ఆమె ఎలా చూస్తారు? వారితో ఆమె వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంటాయి? అనే విషయం మాత్రం పెద్దగా బయటకు రాదు. ఇప్పుడు అదే త్రిష ఇమేజ్‌కు మరో కొత్త పార్శ్వాన్ని చూపిస్తోంది.
ఇండస్ట్రీలో పరిచయాలు ఉండటం చాలా సాధారణం. ఒకే సినిమా సెట్లో కలిసి పనిచేయడం, ఈవెంట్లలో కలవడం కూడా కామనే. కానీ పరిచయం దాటి ఎదుటి వ్యక్తి ఎదుగుదలను నిజంగా ఆనందించడం మాత్రం వేరే విషయం. ముఖ్యంగా ఒకే రంగంలో, ఒకే స్థాయికి చేరుకునే ప్రయాణంలో ఉన్న ఇద్దరు హీరోయిన్ల మధ్య అలాంటి భావన ఉండటం మరింత ప్రత్యేకం. మాళవిక కెరీర్ జర్నీలో త్రిష చూపిన ఆప్యాయతను ఈ విధంగానే చూడొచ్చు. ఇది కేవలం ఇద్దరు హీరోయిన్ల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెడుతున్న వారికి సీనియర్లు ఇచ్చే మోటివేషన్ ఎంత ముఖ్యమో చెప్పే ఎగ్జాంపుల్‌గా కూడా నిలుస్తోంది.
స్క్రీన్‌పై హీరోయిన్లను తరచూ ఒకరితో ఒకరిని పోల్చడం, ఎవరి మార్కెట్ ఎక్కువ? ఎవరి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి? అనే డిస్కషన్స్ జరుగుతుండటం సహజమే కానీ కెమెరా వెనుక మాత్రం ఒక హీరోయిన్ మరో హీరోయిన్ సక్సెస్ ను కోరుకోవడం కూడా జరుగుతుందనే విషయం ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. ఇదే హీరోయిన్ల మధ్య ఉండే సైలెంట్ సపోర్ట్ సిస్టమ్‌కు ఉదాహరణగా నిలుస్తోంది.
త్రిష విషయంలో ఈ అంశం మరింత ఆసక్తికరంగా అనిపిస్తోంది. దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె, తన తర్వాతి తరం హీరోయిన్లను కేవలం పోటీగా కాకుండా ఎదుగుతున్న టాలెంట్‌గా చూడటం ఆమె వ్యక్తిత్వంలోని మరో యాంగిల్‌ను చూపిస్తోంది. స్టార్‌డమ్ అంటే కేవలం హిట్లు, ఫాలోయింగ్, భారీ సినిమాలు మాత్రమే కాదని చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి. తమ చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించడం, కొత్తవారికి ధైర్యం చెప్పడం కూడా స్టార్ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. ఆ పరంగా చూస్తే, త్రిషకు వస్తున్న ప్రశంసలు ఆమె కెరీర్ సక్సెస్‌లకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఆమె నిర్మించుకున్న హ్యూమన్ రిలేషన్స్ కు కూడా గుర్తింపుగా కనిపిస్తున్నాయి.