రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. ఓవర్సీస్ లెక్క ఎంతంటే?
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
నిజానికి ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి ప్రీమియర్స్ షోస్ పడగా.. అప్పుడే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చిన సంగతి విదితమే. ఆ తర్వాత రోజురోజుకు వసూళ్లు పెరిగాయి. ముఖ్యంగా మొదటి వీకెండ్ ను సినిమా బాగా క్యాష్ చేసుకుంది. అంతే కాదు ఆ తర్వాత వీక్ డేస్ లో కూడా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్టడీగా వసూలు చేసింది.
ఇండియాలో ఐదు రోజుల్లోనే రూ.20 కోట్లు సాధించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ.. ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి కూడా అక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సినిమా దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకుపోతుందనే చెప్పాలి.
ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ఆరు లక్షల డాలర్లకు పైగా గర్ల్ ఫ్రెండ్ రాబట్టింది. ఈ మేరకు మేకర్స్.. రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నార్త్ అమెరికాలో అధర్వణ భద్రకాళి పిక్చర్స్ సినిమాను రిలీజ్ చేయగా.. ఇప్పటి వరకు 6,25,777 డాలర్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. స్పెషల్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
దాని బట్టి.. ఓవర్సీస్ లో గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎంతటి రేంజ్ లో అదరగొడుతుందో అర్థమవుతోంది. ఇప్పటికే అక్కడ లాభాల బాటలో పయనిస్తున్న సినిమా.. ఫుల్ రన్ లో మరిన్ని వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఈ తరం అమ్మాయిలు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఇక సినిమా విషయానికొస్తే.. రష్మికతోపాటు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించారు. అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సాంగ్స్ కు బాణీలు కట్టారు. ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం సమకూర్చారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని గ్రాండ్ గా రూపొందించారు.