ఈసారి ఫైల్స్‌ వసూళ్లు తెచ్చి పెట్టలేదు

బాలీవుడ్‌ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవల తీసిన సినిమాలన్నీ తీవ్ర వివాదాలను రాజేసిన విషయం తెల్సిందే.;

Update: 2025-09-09 20:30 GMT

బాలీవుడ్‌ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవల తీసిన సినిమాలన్నీ తీవ్ర వివాదాలను రాజేసిన విషయం తెల్సిందే. ఆయన తాష్కెంట్ ఫైల్స్ సినిమా మొదలుకుని వరుసగా ది కాశ్మీర్ ఫైల్స్, వాక్సిక్ వార్‌ సినిమా ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నాయి అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన తాష్కెంట్ ఫైల్స్, ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా కమర్షియల్‌గా బిగ్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా ది కశ్మీర్‌ ఫైల్స్ రాబట్టిన వసూళ్లు ఆ సమయంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. వందల కోట్ల వసూళ్లు సాధించడం ద్వారా మరిన్ని ఫైల్స్ మూవీలను తీసుకు వచ్చేందుకు వివేక్ అగ్నిహోత్రి కి మద్దతుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

వివేక్ అగ్నిహోత్రి బెంగాల్‌ ఫైల్స్‌ టాక్‌..

తాజాగా వివేక్ అగ్నిహోత్రి నుంచి 'ది బెంగాల్‌ ఫైల్స్‌' సినిమా వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను బట్టే ఈ కథ పశ్చిమ బెంగాళ్‌కి సంబంధించింది అని అర్థం అవుతుంది. మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్‌ కుమార్‌, సిమ్రత్‌ కౌర్‌, అనుపమ్‌ ఖేర్‌లు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే తీవ్ర వివాదాలను రాజేసింది. ఈ సినిమా పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారంను రేపుతాయనే ఉద్దేశంతో రిలీజ్‌కి అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్‌లో సినిమా విడుదల చేయకుండానే దేశంలో ఇతర రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేశారు. అయితే విడుదల అయిన రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రమే ఉన్నాయి. వివేక్ అగ్నిహోత్రి గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా వసూళ్లు నమోదు కావడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్‌.

ది కశ్మీర్‌ ఫైల్స్ వసూళ్లు..

సెప్టెంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా మొదటి వీకెండ్‌లో కేవలం రూ.6.5 కోట్లను వసూళ్లు చేసింది. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా రాబట్టిన వసూళ్లతో పోల్చితే ఈ సినిమా వసూళ్లు మరీ తక్కువగా ఉన్నాయి. ఓపెనింగ్స్ డల్‌గా ఉండటంతో లాంగ్‌ రన్‌లోనూ ఇదే తరహా వసూళ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది బాక్సాఫీస్‌ వర్గాల అంచనా. కేవలం వివాదం కోసం తీసిన సినిమా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. వివేక్‌ అగ్నిహోత్రి తన సినిమాలతో రెండు వర్గాల మధ్య విభేదాలు రగిల్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొందరి మాట. మొత్తానికి ఒక పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్‌కి వెళ్లడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. లాంగ్‌ రన్‌లో ఏమైనా ఫలితం మారుతుందా అనేది చూడాలి.

ది బెంగాల్‌ ఫైల్స్ రివ్యూ

దేశంలోని మత విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా ఉంది అనేది కొందరి వాదన. రాజకీయ పార్టీల మధ్య జరిగిన వాధన, గొడవలు, మతాల మధ్య జరిగిన గొడవలను ఈ సినిమాలో బాహాటంగానే చూపించారు. ఎమోషన్స్‌ తగ్గడంతో పాటు, సినిమాలో వివాదం ఎక్కువగా ఉంది. అందుకే సినిమాను ప్రేక్షకులు చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టడం లేదు అనేది రివ్యూవర్స్ అభిప్రాయం. సినిమాకు కొందరు పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చినా కూడా మెజార్టీ రివ్యూవర్స్ యావరేజ్‌, నెగటివ్‌ రివ్యూలు ఇచ్చారు. ఆ కారణం వల్ల కూడా సినిమాకు మినిమం ఓపెనింగ్స్ నమోదు కాలేదు. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ఐ యామ్‌ బుద్ద ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. పల్లవి జోషి, అగ్నిహోత్రి సైతం సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన డైరెక్ట్‌ యాక్షన్‌ డే ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ఫలితం తో వివేక్ అగ్నిహోత్రి ఫైల్స్ మూవీకి బ్రేక్ వేస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News