• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నానితోనే మళ్లీ ఆ...

నానితోనే మళ్లీ ఆ డైరెక్టర్..?

| సరిపోదా శనివారం అంటూ రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-02-29 09:43 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలు వాటికి తగినట్టుగానే వరుస హిట్లు కొడుతున్న హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడు. దసరా, హాయ్ నాన్న సినిమాల హిట్లతో లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీకి తన కంట్రిబ్యూషన్ ఇచ్చేసిన నాని ఈ ఇయర్ కూడా అందుకు తగినట్టుగానే ప్లాన్ చేసుకున్నాడు. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సరిపోదా శనివారం అంటూ రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్ గా నాని బర్త్ డే కానుకగా నాని సుజిత్ కాంబో మూవీని అనౌన్స్ చేశారు. ఇదిలాఉంటే నానితో తీసిన డైరెక్టర్ మళ్లీ నానినే కావాలని అంటున్నారు. నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మళ్లీ నానితోనే సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇదే క్రమంలో నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేసి హిట్ అందుకున్న డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కూడా నానినే తన నెక్స్ట్ హీరో అనేస్తున్నాడు.

అసలైతే రాహుల్ ఈమధ్య నందమూరి బాలకృష్ణకు ఒక కథ వినిపించాడని ఆయన నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడని అన్నారు. అయితే రాహుల్ బాలయ్య కాంబో కుదరకపోతే మరోసారి శ్యామ్ సింగ రాయ్ కలయికలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే నాని కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేశాడట రాహుల్. త్వరలోనే నానిని కలిసి కథ చెప్పేందుకు చూస్తున్నాడట.

నాని సరిపోదా శనివార పూర్తి చేయడం ఆలస్యం సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఇక అది పూర్తి చేశాక శ్రీకాంత్ ఓదెల లైన్ లో ఉన్నాడు. మరి రాహుల్ తో సినిమా ఎప్పటికి కుదురుతుందో చూడాలి. బాలయ్య ఛాన్స్ ఇస్తే ముందు ఆయనతో సినిమా చేసి ఆ తర్వాత నానితో సినిమా చేయాలని చూస్తున్నాడు రాహుల్. మరి శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ ఓకే అంటే 109వ సినిమా తర్వాత వెంటనే సెట్స్ మీదకు వెళ్తుంది. కానీ నాని తో అంటేనే మరో ఏడాది దాకా రాహుల్ వెయిట్ చేయాల్సి ఉంటుంది.


Full View


Tags:    
  • Tollywood 
  • Dasara 
  • Hinanna 
  • Shyamsingharoy 
  • Saripodhaasanivaaram 
  • Priyankaarulmohan 
  • Vivekathreya 
  • Nani 
  • Rahulsankrityan 
  • Srikanthodela 
  • Sujeeth 
  • Balakrishna 

Similar News

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

Copyright @2026

Powered by Blink CMS