థమన్ 'గేమ్‌ ఛేంజర్‌' కామెంట్స్‌ వైరల్‌..!

మెగా ఫ్యాన్స్ తో పాటు తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'గేమ్‌ చేంజర్‌'.

Update: 2024-05-23 07:16 GMT

మెగా ఫ్యాన్స్ తో పాటు తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'గేమ్‌ చేంజర్‌'. రామ్ చరణ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను తమిళ స్టార్‌ దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నాడు. దిల్‌ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా గురించి అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా విడుదల ఆలస్యం అవుతున్నా కొద్ది సినిమా యొక్క వెయిట్‌ పెరుగుతున్నట్లుగా అంచనాలు పెరుగుతున్నాయి అంటూ మరోసారి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంను చూస్తే అర్థం అవుతుంది.

తాజాగా సంగీత దర్శకుడు థమన్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలోని పాటలు అనే కాకుండా ప్రతి ఎలిమెంట్‌, ప్రతి షాట్‌, ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు శంకర్ సర్ చాలా సంవత్సరాల తర్వాత తన మార్క్ మేకింగ్‌ తో అదరగొట్టబోతున్నారు.

ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫీస్ట్‌ వంటి మూవీ గా నిలుస్తుంది. సినిమాకు సంబంధించి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి థమన్‌ కామెంట్స్ వైరల్‌ అవ్వడంతో పాటు గేమ్‌ చేంజర్ పై అంచనాలను మరింతగా పెంచాయి.

Read more!

రామ్‌ చరణ్ కి జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్న చరణ్ మరో పాత్రకు గాను జోడీగా అంజలి నటిస్తుంది. ఇప్పటికే లీక్ అయిన పిక్స్ మరియు అధికారికంగా వచ్చిన పాటలు, పోస్టర్స్ సినిమా స్థాయిని పెంచగా థమన్ వ్యాఖ్యలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి.

ఇప్పటి వరకు అధికారికంగా విడుదల తేదీ విషయంలో దిల్ రాజు ఆఫీస్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ కచ్చితంగా ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసే విధంగా దర్శకుడు శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇండియన్ 2 విడుదల అయిన వెంటనే గేమ్‌ చేంజర్‌ పనులు పూర్తి చేసే విధంగా శంకర్ ప్లాన్‌ చేస్తున్నాడట.

Tags:    

Similar News