అఖండ2 ట్రైలర్ పై అంచనాలు పెంచేసిన తమన్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న తాజా సినిమా అఖండ2 తాండవం.;
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న తాజా సినిమా అఖండ2 తాండవం. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో బాలయ్య- బోయపాటి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవడంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న అఖండ2
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అఖండ2 సినిమా పలు విషయాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ సినిమాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అఖండ2ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
సాంగ్స్ కు మంచి రెస్పాన్స్
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసిన మేకర్స్ ఆల్రెడీ ముంబైలో ఫస్ట్ సింగిల్ తాండవంను, వైజాగ్ లో సెకండ్ సింగిల్ జాజికాయ ను రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకోవడంతో పాటూ దేశ వ్యాప్తంగా సినిమాపై ఉన్న బజ్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా అఖండ2 ట్రైలర్ ను ఇవాళ నవంబర్ 21 సాయంత్రం రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలుసు.
అఖండ2 ట్రైలర్ పై తమన్ పోస్ట్
అఖండ2 టీజర్, సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అందరూ ఈ ట్రైలర్ కోసమే వెయిట్ చేస్తుండగా, ట్రైలర్ గురించి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడే అఖండ2 ట్రైలర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తైందని, ట్రైలర్ బ్లాస్ ఓ బ్లాస్, ఓం నమః శివాయ, ఇది బాలయ్య గారి మాస్ అంటూ ఓ పోస్ట్ చేయగా, ఫ్యాన్స్ ఈ అప్డేట్ విని ఫుల్ ఖుషీ అవుతున్నారు. అఖండ సినిమాకు తన బీజీఎంతో స్పీకర్లు పగలకొట్టిన తమన్, ఈ సినిమాకు దాన్ని మించిన అవుట్‌పుట్ ఇస్తానని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పగా, ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.