• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్.. 4 రోజుల్లోనే...

తమన్.. 4 రోజుల్లోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్!

| తేరికి జీవీ ప్రకాష్ అందించిన అవుట్ పుట్ కన్నా బేబీ జాన్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-05 05:49 GMT

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు అదిరిపోయే మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సూపర్ ఫేమ్ సంపాదించుకున్నారు. కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వర్క్స్ ను పూర్తి చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

ప్రస్తుతం స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ కు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ హీరో బాలయ్య అఖండ-2కు బాణీలు కడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలు ఆయన ఖాతాలోనే ఉన్నాయి. బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న బేబీ జాన్.. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. 2016లో వచ్చిన హీరో విజయ్‌ ‌‌మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న బేబీ జాన్ టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా విడుదల చేశారు. అయితే టీజర్ వచ్చాక.. తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని అంతా చెబుతున్నారు.

తేరికి జీవీ ప్రకాష్ అందించిన అవుట్ పుట్ కన్నా బేబీ జాన్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే రీసెంట్ గా సింగం ఎగైన్ మూవీ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అజయ్‌ దేవ్‌ గణ్‌, కరీనా కపూర్‌, రణవీర్ సింగ్, అక్షయ్‌ కుమార్‌ తదితరులు నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. డైరెక్టర్ రోహిత్‌ శెట్టి రొటీన్‌ పచ్చడి అని చాలా మంది పోస్టులు పెట్టారు.

అయితే ఆ సినిమాకు తమన్.. రవి బస్రూర్ తో కలిసి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తీవ్ర విమర్శలు వచ్చాయి. టార్చర్ గా అనిపించిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వాపోయారు. ఇప్పుడు సింగం అగైన్ రిలీజ్ అయిన నాలుగు రోజులకే తమన్.. బేబీ జాన్ టీజర్ కు గాను ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో ఇది ఆయనకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. నాలుగు రోజుల్లోనే సింగం ఎగైన్ విషయంలో వచ్చిన విమర్శలను మర్చిపోయేలా చేశారన్నమాట! మరి తమన్.. తన అప్ కమింగ్ ప్రాజెక్టులతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    
  • Ssthaman 
  • Musicdirector 
  • Babyjohn 
  • Therajasaab 
  • Prabhas 
  • Akhanda2 
  • Ogmovie 
  • Pawankalyan 
  • Siddujonnalagadda 
  • Gvprakash 
  • Singhamagain 
  • Ravibasrur 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS