రష్మిక మూవీ వేడుక... లవ్‌ అఫైర్‌పై క్లారిటీ

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'థామా' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.;

Update: 2025-10-19 08:30 GMT

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'థామా' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఆయుష్మాన్‌ ఖురానా కంటే ఎక్కువగా రష్మిక మందన్న ఈ సినిమా ప్రమోషన్‌లో కనిపిస్తుంది. తన పాన్‌ ఇండియా ఇమేజ్‌తో, తన యానిమల్‌, ఛావా సినిమాల సక్సెస్‌ జోష్‌తో రష్మిక మందన్న థామా సినిమాను ప్రమోట్‌ చేస్తోంది. ఖచ్చితంగా థామా సినిమాతో బాలీవుడ్‌లో తన స్టార్‌డం మరింతగా పెరుగుతుందనే విశ్వాసంను రష్మిక మందన్న వ్యక్తం చేస్తోంది. తాజాగా థామా సినిమా ప్రీమియర్‌ షో జరిగింది. ఆ ప్రీమియర్‌ షోకి బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ముఖ్యంగా ఈ ప్రీమియర్‌ షో లో కనిపించిన హుమా ఖురేషి గురించి ప్రస్తుతం మీడియా సర్కిల్స్‌లో, నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈమె తన సీక్రెట్‌ లవ్‌ అఫైర్‌కి క్లారిటీ ఇచ్చిందని అంతా అంటున్ఆనరు.

హుమా ఖురేషి లవ్‌ అఫైర్‌...

గత కొన్నాళ్లుగా నటి హుమా ఖురేషి, రచిత్‌ సింగ్‌ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఆమధ్య వివాహ నిశ్చితార్థం గురించి ప్రముఖంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇద్దరి ప్రేమ అంటూ వచ్చిన వార్తలు, జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవం, కేవలం కొందరు పుట్టించిన పుకార్లు అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో థామా సినిమా ప్రీమియర్ షో తో పాటు ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఇచ్చిన దీపావళి పార్టీకి హుమా ఖురేషి హాజరు అయింది. ఒంటరిగా హాజరు అయితే ఇక్కడ ఆమె గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు, కానీ ఆమె తన సీక్రెట్‌ లవర్‌ రచిత్‌ సింగ్‌తో హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

రచిత్‌ సింగ్‌తో దీపావళి పార్టీకి హుమా

హుమా ఖురేషి మోడలింగ్‌ నుంచి నటన వైపు అడుగులు వేయడంలో రచిత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించాడని బాలీవుడ్‌లో అనుకుంటూ ఉంటారు. హుమాకి నటనలో కోచింగ్‌ ఇచ్చింది రచిత్‌ సింగ్ అనే విషయం అందరికి తెలిసిందే. ఆ విషయాన్ని హుమా చాలా సార్లు మీడియా ముందు కూడా చెప్పింది. తన గురువు రచిత్‌ సింగ్ అంటూ ప్రకటించిన హుమా ఖురేషి ఆయనతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాత్రం సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చింది. ఎంతగా రిలేషన్‌షిప్స్‌ను సీక్రెట్‌గా ఉంచాలని భావించినా ఏదో ఒక సమయంలో అవి బయట పడక తప్పదు అంటారు. ఇప్పుడు అదే జరిగింది. తాజా దీపావళి ఈవెంట్‌లో వీరిద్దరు కలిసి చట్టా పట్టాలేసుకుని హాజరు అవ్వడంతో అంతా కూడా వీరిద్దరి మధ్య ఉన్న వ్యవహారం కేవలం పుకార్లు కాదు, ఇద్దరి మధ్య వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది, పెళ్లి జరగబోతుందని అంటున్నారు.

రష్మిక మందన్న థామా సినిమా ప్రీమియర్‌ షో

నటిగా హుమా ఖురేషి నటిగా చాలా బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి కి దూరంగా ఉండాలని కొందరు సూచించడం వల్ల ఇప్పటికే జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అయితే రష్మిక మందన్న నటించిన థామా సినిమా కారణంగా హుమా ఖురేషి, రచిత్‌ సింగ్‌ ల యొక్క ప్రేమ వ్యవహారం కన్ఫర్మ్‌ అయింది. ఇక పెళ్లి గురించిన వార్తలు ముందు ముందు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో హుమా ఖురేషి ఆ మధ్య ఒక సినిమా ఆఫర్‌ దక్కించుకుందనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో తెలుగు సినిమా క్యాన్సల్‌ అయింది. ప్రస్తుతం కన్నడంలో టాక్సిక్ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా మరో మూడు నాలుగు సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. కనుక వాటిని పూర్తి చేసిన తర్వాత అంటే వచ్చే ఏడాదిలో ఈమె వివాహం ఉంటుందేమో చూడాలి.

Tags:    

Similar News