సెన్సార్ అవ్వకపోతే వాళ్లిద్దరి ముందుకే!
దళపతి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం `జననాయగన్ ` చుట్టూ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
దళపతి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం `జననాయగన్ ` చుట్టూ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రి అయినా? సరే ఇండస్ట్రీలో రిలీజ్ డిస్కషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా ఎదురవుతోన్న సెన్సార్ ఇబ్బందులు , చట్టపరమైన అనుమతుల ప్రక్రియ కోలీవుడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాత ఇటీవల మీడియా ముఖంగా సంచలన విషయాన్ని వెల్లడించారు. సినిమా నిర్మాణ పనులు పూర్తయి చాలా కాలం గడిచినా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి ఇంకా ఎలాంటి అనుమతులు లేదా సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదని పేర్కొన్నారు.
సాధారణంగా పెద్ద స్టార్ల చిత్రాలకు సెన్సార్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంటుంది. కానీ విజయ్ ఆఖరి చిత్రం విషయంలో మాత్రం గత ఐదు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడం గమనార్హం. ఈ ఐదు నెలల సుదీర్ఘ జాప్యానికి గల కారణాలపై పరిశ్రమలో రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని , సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఈ చిత్రంలో బలమైన సామాజిక, రాజకీయ అంశాలను చేర్చినట్లు తెలుస్తోంది. `జననాయగన్` అనే శీర్షికకు తగ్గట్టుగానే సమాజంలోని లోపాలను, ప్రభుత్వ వ్యవస్థలను ప్రశ్నించే ఘాటైన డైలాగులు , సన్నివేశాలు ఉండటం వల్లే సెన్సార్ బోర్డు సభ్యులు దీనికి అనుమతి ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ తీవ్రమైన మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒక భారీ బడ్జెట్ సినిమా ఐదు నెలల పాటు హోల్డ్‌లో ఉండిపోవడం వల్ల వడ్డీల భారం పెరగడమే కాకుండా, బిజినెస్ ఒప్పందాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేకపోవడం వల్ల అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు థియేటర్ యాజమాన్యాలు కూడా తమ తదుపరి ప్రణాళికలు వేసుకోలేక సందిగ్ధంలో పడ్డాయి.
ఈ ఆలస్యంపై విజయ్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రియతమ నటుడిని వెండితెరపై ఆఖరిసారిగా చూడాలనే ఉద్దేశంతో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న కావాలనే సినిమాను ఆలస్యం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో ఆరోపణలు చేస్తున్నారు. సినిమా కంటెంట్‌లో ఎలాంటి ప్రధాన కట్స్ లేకుండా, విజయ్ మార్క్ పొలిటికల్ డ్రామాను యథాతథంగా థియేటర్లలో చూడాలని తాము కోరుకుంటున్నట్లు వారు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి చిత్ర బృందం సెన్సార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైతే ముంబైలోని రివైజింగ్ కమిటీని లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని అడ్డంకులను అధిగమించి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.